- Telugu News Photo Gallery Technology photos Google maps introducing live location sharing feature in maps
Google Maps: వాట్సాప్ పనిలేకుండానే, లైవ్ లొకేషన్ షేర్ చేసుకునే అవకాశం.. ఎలాగంటే.
ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ వినియోగం అనివార్యంగా మారింది. ప్రతీ ఒక్కరూ మ్యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక మ్యాప్స్ అనగానే తొలుత గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. యూజర్లకు కచ్చితమైన లొకేషన్ అందించడంలో మ్యాప్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే మ్యాప్స్ తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను పరిచయం చేసింది..
Updated on: Jan 03, 2024 | 11:24 AM

ఒకప్పుడు ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే ఏదైనా ల్యాండ్ మార్క్ చెబుతూ గైడ్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఒక చిన్న లైవ్ లొకేషన్ పంపిస్తే చాలు. ఒక్క మాట మాట్లాడకుండా నేరుగా అడ్రస్‌కు చేరుకునే పరిస్థితి వచ్చింది.

దీనికి ప్రధాన కారణం లైవ్ లొకేషన్ ఫీచర్. అయితే ఇప్పటి వరకు ఈ ఫీచర్‌ను వాట్సాప్ వంటి ఇతర యాప్స్‌లో అందుబాటులో ఉండేది. వాట్సాప్‌లో లైవ్ లొకేషన్ షేర్ చేయడం ద్వారా ఎదుటి వ్యక్తికి మీరున్న అడ్రస్‌ను షేర్ చేసుకోవచ్చు.

అయితే తాజాగా గూగుల్ మ్యాప్స్ ఎలాంటి థార్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండానే లైవ్ లొకేషన్‌ను షేర్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇక లైవ్ లొకేషన్ ఎంత సమయమైనా ఆన్‌లోనే ఉంటుంది.

ఇక ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు ముందుగా.. గూగుల్ మ్యాప్స్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. అనంతరం పైన కుడివైపున్న ఫ్రొఫైల్ అకౌంట్‌పై క్లిక్ చేసి అందులో ‘లొకేషన్ షేరింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే.. ‘న్యూ షేర్’పై క్లిక్ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. లేదా ‘అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్’ ఆప్షన్ ఎంచుకొని కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని మెసేజ్ సెండ్ చేయాలి. అంతే అవతలి వ్యక్తికి టెక్ట్స్ మెసేజ్ రూపంలో మీ లైవ్ లొకేషన్ లింక్ వెళ్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మ్యాప్స్‌లో లోకేషన్ కనిపిస్తుంది.





























