మళ్లీ చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా
చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఇస్రో మళ్లీ వాయిదా వేసింది. జూలైలో ఆ ప్రయోగం చేస్తామని తెలిపింది. ల్యాండర్‌కు చిన్నపాటి నష్టం కలిగినందువల్లే ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తున్నా.. అలాంటిదేమీ లేదని ఓ ఇస్రో అధికారి తెలిపారు. చంద్రుడిపై ల్యాండర్‌ను పంపాలనుకున్న ఇజ్రాయెల్ ప్రయోగం వైఫల్యమైనందువల్లే తాము జాగ్రత్త పడ్డామని, చంద్రయాన్-2 విషయంలో ఎటువంటి సాహసమూ చేయదలచుకోలేదని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ చంద్రుడిపై ల్యాండర్‌ను పంపలేకపోయిందని, చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడమే తమ లక్ష్యమని ఆయన […]

చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఇస్రో మళ్లీ వాయిదా వేసింది. జూలైలో ఆ ప్రయోగం చేస్తామని తెలిపింది. ల్యాండర్‌కు చిన్నపాటి నష్టం కలిగినందువల్లే ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తున్నా.. అలాంటిదేమీ లేదని ఓ ఇస్రో అధికారి తెలిపారు. చంద్రుడిపై ల్యాండర్‌ను పంపాలనుకున్న ఇజ్రాయెల్ ప్రయోగం వైఫల్యమైనందువల్లే తాము జాగ్రత్త పడ్డామని, చంద్రయాన్-2 విషయంలో ఎటువంటి సాహసమూ చేయదలచుకోలేదని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ చంద్రుడిపై ల్యాండర్‌ను పంపలేకపోయిందని, చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లోనే ఈ ప్రయోగం చేయాల్సి ఉన్నా.. మార్చిలో జీసాట్-6ఏతో ఇస్రో సంబంధాలు తెగిపోవడంతో అక్టోబరులో ప్రయోగాన్ని వాయిదా వేశారు. తాజాగా ఇజ్రాయెల్ వైఫల్యంతో మరోమారు ప్రయోగం వాయిదా పడింది.