Watch Video: ఈ గోల్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. 4 మ్యాచ్‌ల్లో 11.. ఈ రెండైతే తప్పక చూడాల్సిందే..
FIFA World Cup 2022: ఈ 4 మ్యాచ్‌లలో మొత్తం 8 జట్లు మైదానంలో తలపడ్డాయి. ఇందులో మొరాకో, క్రొయేషియా, జర్మనీ, జపాన్, స్పెయిన్, కోస్టారికా, బెల్జియం, కెనడా జట్లు ఉన్నాయి.
ఫిఫా ప్రపంచ కప్ 2022లో బుధవారం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొత్తం 11 గోల్స్ వర్షం కురిపించాయి. అంటే గోల్‌పోస్ట్‌పై 11 సార్లు విజయవంతమైన దాడి కనిపించింది. ఈ 4 మ్యాచ్‌లలో మొత్తం 8 జట్లు మైదానంలో తలపడ్డాయి. ఇందులో మొరాకో, క్రొయేషియా, జర్మనీ, జపాన్, స్పెయిన్, కోస్టారికా, బెల్జియం, కెనడా జట్లు ఉన్నాయి. బుధవారం మొరాకో, క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా రాకపోవడంతో డ్రాగా ముగిసింది. అయితే మ్యాచ్ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లో గోల్స్ వర్షం కురిసింది. ముఖ్యంగా ఈ 11 గోల్స్‌లో రెండు గోల్స్ అయితే అభిమానులకు ఎంతో ఆనందాన్ని అందించాయి. ఫిఫా ప్రపంచ కప్ 2022లో అద్భుతమైన గోల్స్‌గా వీటిని చెబుతున్నారు.
జర్మనీ, జపాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 3 గోల్స్ కనిపించాయి. ఈ మూడు గోల్స్‌లో జపాన్ 2 గోల్స్ చేసి, టోర్నమెంట్‌లో జర్మనీకి పెద్ద దెబ్బ తీసింది. 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఓడించింది.
స్పెయిన్ 7 గోల్స్..
స్పెయిన్ వర్సెస్ కోస్టారికా మ్యాచ్‌లో గోల్స్ జోరు కనిపించింది. ఈ మ్యాచ్‌లో చాలా గోల్స్ నమోదయ్యాయి. స్పెయిన్ విజయం ప్రపంచకప్‌లో అతిపెద్ద విజయంగా నమోదైంది. కోస్టారికాతో స్పెయిన్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ 7 సార్లు కోస్టారికా గోల్ పోస్ట్‌ను కట్ చేసింది. మీన్స్ మొత్తం 7 గోల్స్ చేశాడు.
ఓడిపోయిన కెనడా..
Spain have arrived at the #FIFAWorldCup ?#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) November 23, 2022
వీడియోని ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు..
ఇక చివరి మ్యాచ్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 24వ తేదీన జరిగిన ఈ మ్యాచ్ బెల్జియం vs కెనడా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విశేషమేమిటంటే.. ఇందులో కెనడా ఆధిపత్యం నిలవగా, ఐరోపా దేశం బెల్జియం మాత్రం విజయం సాధించింది. కెనడా బెల్జియం గోల్‌పోస్ట్‌పై వేగంగా దాడులు చేసింది. కానీ, అది ఒక్కసారి కూడా గోల్ చేయడంలో విజయవంతం కాలేదు. అదే సమయంలో బెల్జియంకు కొన్ని అవకాశాలు లభించాయి. కానీ, వాటిలో ఒకదాన్ని గోల్‌గా మార్చగలిగింది.
?? Spain looked unstoppable against Costa Rica#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) November 23, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..