Formula 4 Indian Championship: ఫార్ములా–4 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన హైదరాబాదీ బ్లాక్‌బర్డ్స్ రేసర్
భారత్‌లో తొలిసారి నిర్వహించిన ఫార్ములా నైట్ రేసింగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖిల్ అలీభాయ్ సత్తా చాటాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024 ఎడిషన్‌లో భాగంగా జరిగిన ఫార్ములా–4 ఇండియన్ చాంపియన్‌షిప్ రెండో రేసులో అఖిల్ విజేతగా నిలిచాడు. చెన్నైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ సర్క్యూట్‌లో ఆదివారం (సెప్టెంబర్ 01) రాత్రి జరిగిన ఈ రేసును..
భారత్‌లో తొలిసారి నిర్వహించిన ఫార్ములా నైట్ రేసింగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖిల్ అలీభాయ్ సత్తా చాటాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024 ఎడిషన్‌లో భాగంగా జరిగిన ఫార్ములా–4 ఇండియన్ చాంపియన్‌షిప్ రెండో రేసులో అఖిల్ విజేతగా నిలిచాడు. చెన్నైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ సర్క్యూట్‌లో ఆదివారం (సెప్టెంబర్ 01) రాత్రి జరిగిన ఈ రేసును దక్షిణాఫ్రికాకు చెందిన అఖిల్ అందరికంటే ముందుంగా 30 నిమిషాల 0.3.445 సెకన్లతో అగ్రస్థానంతో పూర్తి చేశాడు. తన కారులో సమస్యల కారణంగా తొలి రేస్‌ను కోల్పోయిన అలీభాయ్ రెండో రేసులో మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగో స్థానం నుంచి పోటీని ఆరంభించిన అతను అద్భుతమైన నైపుణ్యం, మెరుపు వేగంతో దూసుకెళ్లి విజేతగా నిలిచాడు. అహ్మదాబాద్ అపెక్స్ రేసర్స్ జట్టుకు చెందిన దివీ నందన్ (30:03.704 సె) రెండో స్థానం, బెంగళూరు స్పీడ్‌స్టర్స్ రేసర్ జేడెన్ పేట్రియాట్ (30:04.413సె) మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు ఇండియన్ రేసింగ్ రెండో రౌండ్ లో స్పీడ్ డెమన్స్ ఢిల్లీ జట్టు రేసర్ అల్వారో పరాంటే, గోవా ఏసెస్ జేకే రేసింగ్ డ్రైవర్ రౌల్ హైమాన్ అగ్రస్థానం సాధించారు. ఈ పోటీలకు హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ యజమాని అక్కినేని నాగచైతన్య, బెంగాల్ టైగర్స్ జట్టు యజమాని, దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ హాజరయ్యారు.
హీరో నాగచైతన్యతో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖిల్ అలీభాయ్
ఇవి కూడా చదవండిInstagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..