Video: నాటౌట్ అయినా ఒరిగేదేమి లేదు లే! తలా పై లైవ్ ల్ షాకింగ్ కామెంట్స్ చేసిన వీరు
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కొంది. ధోని వివాదాస్పద అవుట్ పై తర్డ్ అంపైర్ తీర్పు తీవ్ర విమర్శలకు గురైంది. సునీల్ నరైన్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను కేకేఆర్ సొంతం చేసుకుంది. ధోని బ్యాటింగ్ ఆర్డర్, అతని ప్రభావం లేకపోవడంపై కూడా పెద్ద చర్చ జరుగుతోంది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర ఓటమి పాలవడం, ఆ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని వివాదాస్పద అవుట్ కావడం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీసింది. శుక్రవారం చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని కేవలం 1 పరుగులకే ఔటవ్వడం మాత్రమే కాక, అతని అవుట్‌పై వచ్చిన తర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సునీల్ నరైన్ బౌలింగ్‌లో వచ్చిన బంతి ధోని ప్యాడ్‌ను తాకిన అనంతరం ఆన్-ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించగా, వెంటనే ధోని రివ్యూకు వెళ్లాడు. కానీ అల్ట్రా ఎడ్జ్‌లో కనిపించిన చిన్న స్పైక్‌ను కూడా తర్డ్ అంపైర్ పట్టించుకోకుండా ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని నిలబెట్టాడు. ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపింది. అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఈ నిర్ణయాన్ని విమర్శించగా, వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ, “ధోనిని అవుట్ కాకుండా ఇచ్చినా పెద్ద తేడా ఉండేది కాదు. అతను క్రీజులో ఉండి స్కోరు గరిష్టంగా 130 వరకు తీసివుండేవాడు. కానీ KKR 10.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది కాబట్టి, అది తేడా కాదు” అని వ్యాఖ్యానించాడు.
మ్యాచ్‌లో ధోని 8వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అతని ముందు రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్ వంటి ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. కానీ, ధోని బ్యాటింగ్‌కి వచ్చాక పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సునీల్ నరైన్ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. 3 వికెట్లు తీయడమే కాక, బ్యాటింగ్‌లోనూ 18 బంతుల్లో 44 పరుగులు చేసి, మ్యాచ్‌ను కేకేఆర్ వశం చేసేశాడు. అతనికి తోడుగా మోయిన్ అలీ బౌలింగ్‌లో 1-20తో మంచి కంట్రోల్ చూపగా, ఫీల్డింగ్‌లో రింకు సింగ్ డైవ్ చేసి కొన్ని కీలక పరుగులు నిలిపాడు, ఇది బౌలర్లకు ధైర్యం ఇచ్చింది.
నరైన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, తన బలాలపై దృష్టి పెడతానని, పవర్‌ప్లేలో జట్టుకు మంచి ఆరంభాలు ఇవ్వడమే లక్ష్యమని చెప్పాడు. “ప్రతి రోజు అది పనిచేస్తుందా అన్నది ప్రశ్న కాదు, ప్రయత్నం చేయడమే ముఖ్యం” అని అన్నారు. మరోవైపు మోయిన్ అలీ మాట్లాడుతూ, ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండడం తనకు సహాయపడిందని, బంతిని నిటారుగా ఉంచడం వల్లే తాను అంచనాలను అందుకున్నానని తెలిపాడు. సునీల్ నరైన్ నుంచి స్పిన్ గురించి నేర్చుకుంటున్నానని, పైభాగంలో ప్రతీ బంతిని స్పిన్ చేయడం సాధ్యం కాదని, బ్యాటర్ల మనసుల్లో సందేహాలు కలిగించడం ముఖ్యమని చెప్పారు.
— not psyduck (@psymedia33) April 11, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..