WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఫైనల్ చేరే లెక్కలు ఇవే.. ఐపీఎల్ కంటే భిన్నంగా.. రూల్స్ ఎలా ఉన్నాయంటే?

Women IPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్ నియమాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిబంధనలకు కొద్దిగా భిన్నంగా ఉంటాయి.

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఫైనల్ చేరే లెక్కలు ఇవే.. ఐపీఎల్ కంటే భిన్నంగా.. రూల్స్ ఎలా ఉన్నాయంటే?
Womens Ipl 2023
Follow us

|

Updated on: Feb 05, 2023 | 7:54 AM

WPL 2023 Final Equation: మహిళల ప్రీమియర్ లీగ్ గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నమెంట్ గురించి బీసీసీఐ కీలక విషయాలను ప్రకటించింది. ఫ్రాంచైజీలను ఫైనల్ చేసిన తర్వాత.. ప్రస్తుతం ఆటగాళ్ల కోసం వేలానికి రంగం సిద్ధం చేసింది. మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్ 2023లో జరగనుంది. తాజాగా ఈ మొదటి సీజన్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో టీంలు ఫైనల్స్‌కు చేరే మార్గాన్ని ఎలా ఉండనుందో ప్రకటించారు. మహిళల ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరుకోవడం పురుషుల ఐపీఎల్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందులో నాలుగింటికి బదులు టాప్-3 జట్లు మాత్రమే ఫైనల్ పోరుకు దిగుతాయి.

ఫైనల్‌కు చేరుకోవడానికి సమీకరణాలు..

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, మహిళల ఐపిఎల్‌లో టాప్-3 జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో నంబర్ వన్ జట్టు ఎక్కువ లాభపడుతుంది. నంబర్ వన్ జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇందు కోసం ఆ జట్టు ఎలాంటి క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. అయితే, రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరుకోవడానికి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. గెలిచిన జట్టు నంబర్ వన్ ర్యాంక్ జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.

పురుషుల ఐపీఎల్‌లో మరోలా..

మరోవైపు పురుషుల ఐపీఎల్‌లో ఫైనల్స్‌కు వెళ్లే మార్గం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇందులో టాప్-4 జట్లు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఆడుతాయి. ఇందులో నంబర్ వన్, టూ స్థానాల్లో ఉన్న జట్లకు రెండుసార్లు ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌లో చోటు దక్కించుకోవడానికి రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇందులో నంబర్ వన్, టూ జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది. అదే సమయంలో ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ మూడు, నాలుగు నంబర్ జట్ల మధ్య జరుగుతుంది. ఇందులో, ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఓడిన జట్టుతో నంబర్ వన్, టూ మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ ఆడుతుంది. గెలిచిన జట్టు రెండవ ఫైనలిస్ట్ అవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు