AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australia Tour of India 2023: మరో పోరుకు సిద్ధమంటున్న టీమిండియా.. తగ్గేదేలే అంటున్న ఆసీస్.. జట్లు, షెడ్యుల్ వివరాలివే..

కొత్త ఏడాదిలో వరుస సిరీస్ విజయాలతో దూకుడు మీదున్న టీమిండియాకు అసలైన ప్రత్యర్థి ఎదురు కాబోతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే శ్రీలంక, న్యూజిలాండ్ లాంటి జట్లపై..

Australia Tour of India 2023: మరో పోరుకు సిద్ధమంటున్న టీమిండియా.. తగ్గేదేలే అంటున్న ఆసీస్.. జట్లు, షెడ్యుల్ వివరాలివే..
Australia Tour Of India 2023; 1st Match
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 05, 2023 | 8:40 AM

Share

కొత్త ఏడాదిలో వరుస సిరీస్ విజయాలతో దూకుడు మీదున్న టీమిండియాకు అసలైన ప్రత్యర్థి ఎదురు కాబోతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే శ్రీలంక, న్యూజిలాండ్ లాంటి జట్లపై భారత్ అలవోక విజయాలను అందుకుంది భారత్. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు రోహిత్ సేన రెడీ అయ్యింది. టీమిండియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్(బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్), మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు ఇప్పటికే భారత్‌లో అడుగు పెట్టిన అస్ట్రేలియా జట్టు కూడా సర్వం సిద్ధం చేసుకుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఆసీస్, టీమిండియాకు.. ఈ టోర్నీ(వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23)లో ఇదే  చివరి సిరిస్. కాగా, ఈ ఏడాది జూన్ లో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌కు భారత్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం చాలా కీలకం. ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ నెగ్గాల్సి ఉంది.

ఇదిలా ఉండగా ఈసారి జరగబోయే టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా చాలా సీరియస్‌గా తీసుకుంది. టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదల మీద ఉంది. అందుకు తగ్గట్లుగానే తమ సన్నాహకాలను మొదలు పెట్టింది ఆసీస్ జట్టు. ఈ నేపథ్యంలోనే భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుతో బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది. ఇంకా వచ్చే నెల మార్చి 22 వరకు ఆస్ట్రేలియా జట్టు.. భారత్‌లోనే పర్యటించనుంది.

షెడ్యూల్ ఇదే

  1. ఫిబ్రవరి 9-13 తేదీలలో నాగ్‌పూర్ వేదికగా మొదటి టెస్ట్ (ఉ.గం. 9.30లకు).
  2. ఫిబ్రవరి 17-21 తేదీలలో ఢిల్లీ వేదికగా రెండో టెస్టు (ఉ.గం. 9.30లకు).
  3. మార్చి 1-5 తేదీలలో ధర్మశాల వేదికగా మూడో టెస్టు (ఉ.గం. 9.30లకు).
  4. మార్చి 9-13 తేదీలలో అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు (ఉ.గం. 9.30లకు).
  5. మార్చి 17న వాంఖడే స్టేడియంలో తొలి వన్డే (మ.గం.1.30లకు).
  6. మార్చి 19న రెండో వన్డే వైజాగ్ వేదికగా జరుగుతుంది (మ.గం.1.30లకు).
  7. మార్చి 22న చెన్నై వేదికగా మూడో వన్డే (మ.గం.1.30లకు).

ఇంకా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ టెస్టు సిరీస్‌ను భారత్ భారీ తేడాతో నెగ్గితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్‌కు చేరుకోవడం ఖాయం. అలాగే భారత్ ఈ సిరీస్‌ను గెలుచుకుంటే డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌కు కూడా చేరుకుంటుంది.  ఇక ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. డీడీ స్పోర్ట్స్ కూడా ప్రసారం చేయనుంది.

ఇవి కూడా చదవండి

జట్లు

టీమిండియా (తొలి రెండు టెస్టుల కోసం): రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, షమీ, పుజారా, ఉనాద్కట్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్

ఆస్ట్రేలియా: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), అగర్, బొలాండ్, అలెక్స్ క్యారీ, గ్రీన్, హ్యాండ్స్ కాబ్, హేజల్ వుడ్, స్టార్క్,  ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, మోరిస్, మర్ఫీ, స్వెప్సన్, డేవిడ్ వార్నర్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us