- Telugu News Photo Gallery Cricket photos Cheteshwar pujara need 157 runs in ind vs aus nagpur test border gavaskar trophy most runs list
IND vs AUS: తొలి టెస్టులో 157పై కన్నేసిన నయా వాల్.. ఆ స్పెషల్ రికార్డులో టాప్ 5 ఎవరంటే?
టెస్టు సిరీస్‌లోని మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో జరగనుంది. గత భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌ల మాదిరిగానే, మరోసారి చెతేశ్వర్ పుజారా పాత్ర కీలకం కానుంది.
Updated on: Feb 05, 2023 | 9:32 AM

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ఎక్కువగా చర్చకు వచ్చే బ్యాట్స్‌మెన్ పేరు శుభమాన్ గిల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. ఆస్ట్రేలియాతో ప్రారంభమైన టెస్ట్ సిరీస్‌లో అతని ప్రదర్శన చర్చనీయాంశమైంది. అయితే ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టిన బ్యాట్స్‌మెన్ ఎవరైనా ఉన్నారా అంటే, అది చతేశ్వర్ పుజారానే అని చెప్పుకోవచ్చు.

గత దశాబ్ద కాలంగా టీమిండియా బ్యాటింగ్‌కు గొడలా నిలిచిన పుజారా.. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ లో మరోసారి కీలక పాత్ర పోషించనున్నాడని, అతడి ప్రదర్శనే టీమిండియా విజయాన్ని నిర్ణయించగలదు.

ఈ క్రమంలో తొలి టెస్టులోనే కనీసం 157 పరుగులు సాధించేందుకు పుజరా ప్లాన్ చేస్తున్నాడు. దీంతో భారీ రికార్డులను తన సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో పుజారా ఐదో స్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం పుజారా 20 టెస్టుల్లో 54, 5 సెంచరీల సగటుతో 1893 పరుగులు చేశాడు.

పుజారా కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ 22 టెస్టుల్లో 2049 పరుగులు చేశాడు. 1996లో ప్రారంభమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు సాధించాడు. దిగ్గజ భారత బ్యాట్స్‌మన్ 39 టెస్టుల్లో 55 సగటుతో 3630 పరుగులు చేశాడు. 11 సెంచరీలు చేశాడు.





























