క్రికెట్ మక్కాలో ఫిక్సింగ్ కలకలం.. పక్కా ప్లానింగ్‌తో అడ్డంగా బుక్కైన 3గురు పాక్ ఆటగాళ్లు.. కట్‌చేస్తే.. భారీ షాకిచ్చిన ఐసీసీ..
England vs Pakistan: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు రావడం, ఆ తర్వాత అది నిజమని రుజువైంది. దీంతో ముగ్గురూ శిక్షను ఎదుర్కోవలసి వచ్చింది.

పాకిస్తానీ క్రికెటర్లు – సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అమీర్ ఫిక్సింగ్‌తో చెడ్డపేరు తెచ్చుకున్నారు. 2010లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన పాకిస్థాన్ టెస్టు మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు ముగ్గురూ శిక్షించబడ్డారు. వీరిపై నిషేధం కూడా విధించారు. క్రికెట్ ప్రపంచంలో ఈ సంఘటనను జెంటిల్‌మన్ గేమ్‌లో మచ్చ అని పిలుస్తుంటారు. ఫిబ్రవరి 5 న ఈ ముగ్గురిపై నిషేధం విధిస్తూ క్రికెట్ అత్యున్నత సంస్థ అయిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
ఐసీసీ 2011లో ఈ శిక్షను ప్రకటించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముగ్గురూ దోషులని కోర్టు నిర్ధారించి, ఆపై శిక్ష విధించింది. ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బట్ కెప్టెన్‌గా ఉన్నాడు. జట్టులోని ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఆసిఫ్, అమీర్ ఉన్నారు. ముగ్గురూ మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా నో బాల్‌లు విసిరారని ఆరోపించగా, ఆ తర్వాత అది నిజమని తేలింది.
క్రికెట్ మక్కాలో ఫిక్సింగ్ కలకలం..
2010లో పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. లార్డ్స్ మైదానంలో ఇరు జట్లు సిరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముగ్గురూ ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మజార్ మజీద్ అనే ప్లేయర్ ఏజెంట్ టేప్ బయటకు వచ్చింది. అందులో అతను ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఎప్పుడు నో బాల్‌లు వేయాలో చర్చిస్తున్నట్లు కనిపించింది. విషయం వెలుగులోకి రావడంతో, ఈ ముగ్గురు ఆటగాళ్లపై ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించింది. ఆపై విచారణ కొనసాగింది. ఆ తర్వాత ఐసీసీ బట్‌పై 10 సంవత్సరాలు, ఆసిఫ్‌పై ఏడేళ్లు, అమీర్‌పై ఐదేళ్లు నిషేధం విధించింది. అయితే, సల్మాన్, ఆసిఫ్‌ల ఈ శిక్ష తర్వాత ఐదేళ్లకు తగ్గించారు. అమీర్‌పై ఐదేళ్ల నిషేధం కూడా పడింది. మజీద్‌కు రెండేళ్ల ఎనిమిది నెలల శిక్ష కూడా పడింది.




అయితే తమపై విధించిన నిషేధంపై ముగ్గురు అప్పీలు చేసుకున్నారు. లండన్ కోర్టు 2011 నవంబర్‌లో ముగ్గురికి షాక్ ఇచ్చి జైలు శిక్ష విధించింది. బట్‌కు రెండేళ్ల ఆరు నెలల శిక్ష పడింది. ఆసిఫ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. అమీర్‌కు ఆరు నెలల శిక్ష పడింది. అయితే 2012లో మూడు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత అమీర్ విడుదలయ్యాడు.
క్షమాపణలు చెప్పడంతో మళ్లీ రీఎంట్రీ..
శిక్షను పొందిన తర్వాత, బట్ తన చర్యలకు సిగ్గుపడ్డాడు. 2013లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. తనపై, ఆసిఫ్‌పై నిషేధాన్ని తగ్గించేందుకు ఐసీసీతో మాట్లాడాల్సిందిగా పీసీబీ చైర్మన్ నజామ్ సేథీని బట్ కోరాడు. లాహోర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “స్పాట్ ఫిక్సింగ్ కేసుతో బాధపడ్డ. అభిమానులందరికీ, యావత్ దేశానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నాపై, ఆసిఫ్‌పై నిషేధాన్ని తగ్గించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేయాలని తాత్కాలిక చైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. నా నిషేధంలో రెండేళ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ఐసీసీ నన్ను దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తే, నిషేధం ముగిసే సమయానికి నేను అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉంటాను” అంటూ ప్రకటించాడు.
మళ్లీ క్రికెట్‌లోకి..
దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఐసీసీ అనుమతించిన తర్వాత అమీర్ జనవరి 2015లో కరాచీకి చెందిన గ్రేడ్-2 జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. పాకిస్థాన్ జట్టులో పునరాగమనం చేయడంలో అమీర్ సక్సెస్ అయ్యాడు. ఈ ఎడమచేతి వాటం బౌలర్ తన అద్భుతమైన ఆటతో భారత్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. బట్, ఆసిఫ్ కూడా దేశవాళీ క్రికెట్‌లో పునరాగమనం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




