- Telugu News Photo Gallery These are the world majestic mountains which are also amazing tourist stations
Best Tourist Spot: పర్వతాలను ఎక్కాలనుకుంటున్నారా..? మీకు స్వాగతం పలికే ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక శిఖరాలివే..
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్వతాలు: ఇప్పటివరకు ఎవరెస్ట్ పర్వతం అందం గురించి మాత్రమే మనందరికీ తెలుసు. కానీ అలాంటి సుందరమైన పర్వతాలు ప్రపంచంలో ఇంకెన్నో ఉన్నాయని మీకు తెలుసా..? అవి కూడా పర్వతారోహకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
Updated on: Feb 05, 2023 | 9:15 AM

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్వతాలు: ఇప్పటివరకు ఎవరెస్ట్ పర్వతం అందం గురించి మాత్రమే మనందరికీ తెలుసు. కానీ అలాంటి సుందరమైన పర్వతాలు ప్రపంచంలో ఇంకెన్నో ఉన్నాయని మీకు తెలుసా..? అవి కూడా పర్వతారోహకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వాటి వివరాలను మనం ఈ రోజు చూద్దాం..

మౌంట్ ఎవరెస్ట్ గురించి మీరందరూ వినే ఉంటారు. ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. ప్రపంచం నలుమూలల నుంచి పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరానికి అధిరోహించేందుకు వస్తారు. అయితే ఎవరెస్ట్ లాంటి పర్వతాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. అవి..

గ్రాండ్ టెటన్: అమెరికాలోని గ్రాండ్ టెటాన్ పర్వతం అద్భుతమైన ప్రదేశమని చెప్పుకోవాలి. ఈ పర్వతంపై నుంచి సుందరమైన ఆకుపచ్చని అడవుల, పచ్చిక బయళ్లను సందర్శించవచ్చు.

మౌంట్ ఫుజి: మౌంట్ ఫుజి అనేది జపాన్ దేశానికి పర్యాటక దేశంగా గుర్తింపు తెచ్చిన పర్వతం అని చెప్పడం తప్పు లేదా అతిశయోక్తి కాదు. ఇది జపాన్‌లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రేదేశంగా పేరు పొందింది.

మ్యాటర్ హార్న్: స్విట్జర్లాండ్, ఇటలీ దేశాలలో విస్తరించి ఉన్న ఆల్ప్స్ పర్వతాలలో ఎత్తైన శిఖరం ఈ మ్యాటర్ హార్న్. దీని ఎత్తు 4,478 మీటర్లు.

కాంచన్‌జంగా పర్వతం: కాంచన్‌గంగా అనేది భారత్, నేపాల్ రెండింటిలోనూ ఉన్న శిఖరం. హిమాలయాలలో ఉన్న ఈ పర్వతం మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది.




