Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రిటైర్మెంట్ తర్వాత ఇంటికి చేరిన సానియా మీర్జా.. హగ్‌లతో సర్‌ప్రైజ్ ఇచ్చిన భర్త.. విడాకుల వార్తలకు చెక్ పడినట్లేనా?

Shoaib Malik-Sania Mirza: రిటైర్మెంట్ తర్వాత సానియా మీర్జా దుబాయ్ చేరుకుంది. ఇంటికి చేరుకున్న ఆమెకు కుటుంబం, స్నేహితులు సర్ ప్రైజ్ ఇచ్చారు. సానియా భర్త షోయబ్ మాలిక్ కౌగిలింతలతో ముంచెత్తాడు.

Video: రిటైర్మెంట్ తర్వాత ఇంటికి చేరిన సానియా మీర్జా.. హగ్‌లతో సర్‌ప్రైజ్ ఇచ్చిన భర్త.. విడాకుల వార్తలకు చెక్ పడినట్లేనా?
Sania Mirza Malik Hugs
Follow us
Venkata Chari

|

Updated on: Feb 05, 2023 | 7:39 AM

Sania Mirza Video: భారత స్టార్ వెటరన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైరైంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌లో ఓటమి అనంతరం సానియా తన దుబాయ్ ఇంటికి చేరుకుంది. అయితే, అక్కడ ఆమెకు ఆశ్చర్యం కలిగింది ఫ్యామిలీ. సానియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె కుటుంబం, స్నేహితులు ఆమెను ఆశ్చర్యపరిచినట్లు చూడొచ్చు. సానియా షేర్ చేసిన ఈ వీడియోలో ఆమెతోపాటు భర్త షోయబ్ మాలిక్ కూడా కనిపించాడు. దీంతో ఇప్పటివరకు వస్తోన్న వీరిద్దరి విడాకుల వార్తలకు ముగింపు పలికినట్లేనని తెలుస్తోంది.

సానియా మీర్జాను కౌగిలించుకున్న షోయబ్ మాలిక్..

సానియా మీర్జా తన ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే, ప్రతి ఒక్కరూ ఆమెను చాలా ప్రత్యేకంగా, ప్రేమగా స్వాగతించడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలో, సానియా మొదట తన స్నేహితులను, కుటుంబ సభ్యులను కౌగిలించుకున్నట్లు చూడొచ్చు. ఆ తర్వాత, ఆమె తన భర్త షోయబ్ మాలిక్‌ను కౌగిలించుకోవడం కనిపిస్తుంది. సానియాను కౌగిలించుకునే ముందు షోయబ్ ఆమెకు పూల బొకే ఇచ్చి ‘ఇంటికి స్వాగతం’ పలికాడు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ, సానియా మీర్జా క్యాప్షన్‌లో “ఇంటికి వచ్చినప్పుడు ప్రపంచంలోని మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు మనతోనే ఉన్నారని గ్రహించాలే చేశారు. నా కుటుంబం అంతా దుబాయ్‌లో ఉంది. అందరికి ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది. ఇప్పటి వరకు 33 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

సానియా మీర్జాపై అభినందనలు కురిపించిన షోయబ్ మాలిక్..

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

విశేషమేమిటంటే, దీనికి ముందు, షోయబ్ మాలిక్ ట్వీట్ చేయడం ద్వారా సానియా మీర్జా కెరీర్‌కు అభినందనలు తెలిపాడు. మాలిక్ ట్వీట్‌లో “క్రీడలలో మహిళలందరికీ ఎంతో స్ఫూర్తి. మీ కెరీర్‌లో మీరు సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. అందరికీ స్ఫూర్తిదాయకం, బలంగా ముందుకు సాగండి. అద్భుతమైన కెరీర్‌కు చాలా అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..