AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dipa Karmakar Ban: డోపింగ్ టెస్టులో విఫలమైన భారత స్టార్ జిమ్నాస్ట్‌‌.. 21 నెలల నిషేధం విధించిన ఐటీఏ..

2016 రియో​ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో ఏ భారతీయ జిమ్నాస్ట్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం గమనార్హం.

Dipa Karmakar Ban: డోపింగ్ టెస్టులో విఫలమైన భారత స్టార్ జిమ్నాస్ట్‌‌.. 21 నెలల నిషేధం విధించిన ఐటీఏ..
Dipa Karmakar
Venkata Chari
|

Updated on: Feb 04, 2023 | 11:04 AM

Share

Dipa Karmakar Ban: భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై 21 నెలల నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిషేధం 10 జులై 2023 నుంచి అమలులోకి రానుంది. నిషేధిత పదార్థాన్ని తీసుకున్నందుకు దీపా కర్మాకర్‌ను ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దోషిగా తేల్చింది.

డ్రగ్ తీసుకున్నట్లు నిర్ధారించిన ఐటీఏ..

2016 రియో​ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో ఏ భారతీయ జిమ్నాస్ట్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం గమనార్హం. మీడియా నివేదికల ప్రకారం, దీపా కర్మాకర్ హైజెమిన్ S-3 బీటా-2 తీసుకున్నందుకు దోషిగా తేలింది. నిజానికి అంతర్జాతీయ డోపింగ్ ఏజెన్సీ హైజెమిన్ ఎస్-3 బీటా-2ను నిషేధిత ఔషధాల కేటగిరీలో చేర్చింది. కాగా, దీపా కర్మాకర్‌ శాంపిల్‌ను సేకరించిన అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ.. దోషిగా నిర్ధారించిన తర్వాత 21 నెలల పాటు నిషేధించింది.

దీపా కర్మాకర్ ఎవరు?

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ దీపా కర్మాకర్ కావడం విశేషం. గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో ఈమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారతీయ జిమ్నాస్ట్‌‌గానూ నిలిచింది. దీపా కర్మాకర్ రియో డి జెనీరోలో జరిగిన 2016 సమ్మర్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అయితే ఇప్పుడు ఈ జిమ్నాస్ట్‌పై నిషేధం పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. నిషేధిత పదార్థాన్ని సేవించినందుకు దోషిగా తేలిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల పాటు నిషేధం విధించాలని నిర్ణయించడంతో ఆమె కెరీర్ ఇక ముగిసినట్లే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..