WCL 2024 Final: క్రికెట్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో భారత్-పాక్ ఫైనల్ ఫైట్.. ఎక్కడ చూడొచ్చంటే?
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2024) టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో, ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఛాంపియన్‌ను ఓడించి ఛాంపియన్స్ ఫైనల్‌లోకి ప్రవేశించగా, భారత్ 86 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఛాంపియన్‌ను ఓడించి ఛాంపియన్స్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2024) టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో, ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఛాంపియన్‌ను ఓడించి ఛాంపియన్స్ ఫైనల్‌లోకి ప్రవేశించగా, భారత్ 86 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఛాంపియన్‌ను ఓడించి ఛాంపియన్స్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. దీని ప్రకారం శనివారం (జులై 13 బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నాయి. ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
పఠాన్ బ్రదర్స్ షో..
అంతకు ముందు ఈ టోర్నమెంట్ 2వ సెమీ-ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించంది. నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ బ్రెట్ లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత ఛాంపియన్స్ జట్టుకు ఓపెనర్ రాబిన్ ఉతప్ప శుభారంభాన్ని అందించాడు. అయితే మరోవైపు 14 పరుగులకే అంబటి రాయుడు ఔటయ్యాడు. అయితే ఉతప్ప 35 బంతులు ఎదుర్కొని 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన సురేశ్ రైనా 5 పరుగులు మాత్రమే చేసి వికెట్ లొంగిపోయాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ 28 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కలిసి మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. ఫలితంగా చివరి 6 ఓవర్లలో 95 పరుగులు వచ్చాయి. దీంతో భారత ఛాంపియన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
Jhoome J̵o̵ Do Pathan 💪🎶
It rained sixes in the death overs courtesy Power Packed Pathan Performance™️#WCLonFanCode @iamyusufpathan @IrfanPathan pic.twitter.com/C7n3AiQpl7
— FanCode (@FanCode) July 12, 2024
రెండు జట్ల ఆటగాళ్లు:
భారత ఛాంపియన్స్ జట్టు:
రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), అంబటి రాయుడు, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ (కెప్టెన్), యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, గురుకీరత్ సింగ్ మాన్, పవన్ నేగి, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, ధవల్ కులకర్ణి, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్ , నమన్ ఓజా, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, రాహుల్ శర్మ.
పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు:
కమ్రాన్ అక్మల్ (వికెట్ కీపర్), షర్జీల్ ఖాన్, సోహైబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, మిస్బావుల్ హక్, అమర్ యామిన్, సొహైల్ తన్వీర్, వహాబ్ రియాజ్, సొహైల్ ఖాన్, అబ్దుల్ రజాక్, తౌఫీక్ ఉమర్, మహ్మద్ హఫీజ్, యాసిర్ అరాఫత్, సయీద్ అజ్మల్, ఉమర్ అక్మల్, తన్వీర్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




