AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా కోచ్‌గా వస్తానంటోన్న కింగ్ కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్.. బీసీసీఐ ఏమంటుందో !

రాబోయే T20 ప్రపంచ కప్ తో భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో భారత జట్టుకు తదుపరి ప్రధాన కోచ్‌ని వెతికే పనిలో బీసీసీఐ ఇప్పటికే బిజీ బిజీగా ఉంది. చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఆఫర్లు వచ్చాయి. అదే సమయంలో దిగ్గజ ఆటగాళ్లు కోచ్ పదవిని తిరస్కరించినట్లు వార్తలు కూడా వచ్చాయి.

Team India: టీమిండియా కోచ్‌గా వస్తానంటోన్న కింగ్ కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్.. బీసీసీఐ ఏమంటుందో !
Team India
Basha Shek
|

Updated on: May 25, 2024 | 4:40 PM

Share

రాబోయే T20 ప్రపంచ కప్ తో భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో భారత జట్టుకు తదుపరి ప్రధాన కోచ్‌ని వెతికే పనిలో బీసీసీఐ ఇప్పటికే బిజీ బిజీగా ఉంది. చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఆఫర్లు వచ్చాయి. అదే సమయంలో దిగ్గజ ఆటగాళ్లు కోచ్ పదవిని తిరస్కరించినట్లు వార్తలు కూడా వచ్చాయి. కాగా ప్రధాన కోచ్ పదవికి మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ ప్రకటించింది. కాగా ఆర్‌సీబీ డేంజర్ మ్యాన్‌గా పేరొందిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ టీమ్ ఇండియా తదుపరి ప్రధాన కోచ్‌గా మారే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్‌కు ప్రధాన కోచ్ పదవిని ఆఫర్ చేశారు. కానీ పాంటింగ్ ఆ అభ్యర్థనను తిరస్కరించాడు. దీంతో పాటు రాహుల్ ద్రవిడ్ కూడా తన పదవీకాలాన్ని పొడిగించేందుకు నిరాకరించాడు. మరోవైపు భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతలో, దక్షిణాఫ్రికా మాజీ వెటరన్ ఎబి డివిలియర్స్ స్వయంగా ప్రధాన కోచ్ కావడానికి ఆసక్తిని వ్యక్తం చేశాడు.

ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఏబీ డివిలియర్స్ హెడ్ కోచ్ పదవికి సంబంధించి ప్రకటన చేశాడు. ఈ సందర్భంలో, అతను భవిష్యత్తులో భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతను చేపట్టగలడా అని అడిగినప్పుడు. ఈ ప్రశ్నకు డివిలియర్స్ బదులిస్తూ.. ‘నేను ఈ బాధ్యతను నిర్వహించగలనో లేదో నాకు తెలియదు. కానీ నేను ఈ బాధ్యతను ఎక్కువగా ఆనందిస్తున్నాను. కొత్త బాధ్యతలు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇటీవల, నేను చాలా నేర్చుకున్నాను. దేనికీ నో చెప్పకండి, ఎందుకంటే అక్కడ నుండి ఏదైనా కొత్తది నేర్చుకోవచ్చు. ఎంపిక చేసిన ఆటగాళ్లు, జట్లతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం’ అని డివిలియర్స్ అన్నాడు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి టీమిండియా ప్రధాన కోచ్ గా రావాలన్న ఇంట్రెస్ట్ కు డివీలియర్స్ కు ఉందని తన మాటలతో అర్థమైంది. దక్షిణాఫ్రికా తరఫున, ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున పరుగుల వర్షం కురిపించిన ఈ మిస్టర్ 360 కోహ్లీకి క్లోజ్ ఫ్రెండ్ కూడా. మరి డివీలియర్స్ అభ్యర్థనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..