Watch Video: తిరుమల శ్రీవారి సేవలో బీసీసీఐ సెక్రటరీ జైషా..
తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు బీసీసీఐ సెక్రటరీ జైషా. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఈరోజు ఉదయం తిరుమల చేరుకుని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 6 గంటలకు వీఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు బీసీసీఐ సెక్రటరీ జైషా. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఈరోజు ఉదయం తిరుమల చేరుకుని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 6 గంటలకు వీఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. జైషా దర్శనానంతరం ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈవీ ధర్మారెడ్డితో పాటు ఆలయ అర్చకులు, అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో ఆయనను సత్కరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Published on: May 25, 2024 03:54 PM
వైరల్ వీడియోలు
Latest Videos