Virat Kohli: విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త.. సమర శంఖం పూరించడానికి సిద్ధంగా ఉండండి..

విరాట్ కోహ్లీ 2013లో RCB కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా 9 సీజన్లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, 2021 సీజన్ తర్వాత విరాట్ జట్టు కెప్టెన్‌గా వైదొలిగాడు. కోహ్లి సారథ్యంలో RCB ఒక్కసారి మాత్రమే IPL ఫైనల్‌కు చేరుకుంది. తాజాగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎగిరిగంతేసే వార్త ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Virat Kohli: విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త.. సమర శంఖం పూరించడానికి సిద్ధంగా ఉండండి..
Virat Kohli Wants To Be Captain Of Rcb
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 30, 2024 | 8:41 AM

IPL 2025 సీజన్‌లో ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం అన్ని జట్టులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని వదులుకోవాలని ప్రాంఛైజీలు తర్జన భర్జన పడుతున్నాయి. అయితే ఇది ఇలా ఉంటే ఆర్సీబీ అభిమానులకు షాకింగ్ వార్త ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఐపీఎల్‌లో బెంగళూరు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి మరోసారి జట్టుకు సారథ్యం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

IPL రిటెన్షన్ గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ESPN-Cricinfo ఓ వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2025 ఆర్సీబీ కెప్టెన్‌గా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆర్సీబీ యాజమాన్యాన్ని విరాట్ కోరినట్లు పేర్కొంది. కోహ్లి వరుసగా 9 సీజన్లలో RCB కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఒక్క టైటిల్ కూడా గెలువకపోవడంతో 2021 సీజన్ తర్వాత కెప్టెన్‌గా తనే రాజీనామా చేశాడు. అప్పటి నుండి ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా మూడు సీజన్లలో జట్టు బాధ్యతలు చేపట్టాడు. వచ్చే సీజన్‌లో డుప్లెసిస్‌ను బెంగళూరు కొనసాగించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మెగా వేలం ద్వారా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్‌లలో ఒకరిని జట్టుకు కెప్టెన్‌గా చేయాలని RCB ప్రయత్నిస్తుందని మరో వాదన వినిపిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!