ఇదేందయ్యా ఇది.. 11 ఏళ్ల తర్వాత హాఫ్ సెంచరీ..
TV9 Telugu
31 December 2024
బిగ్ బాష్ లీగ్ 2024 16వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.
అది కూడా సరిగ్గా 11 ఏళ్ల తర్వాత కావడం గమనార్హం. అంటే డేవిడ్ వార్నర్ చివరిసారిగా 2013లో బీబీఎల్‌లో అర్ధశతకం సాధించాడు.
2024 బిగ్ బాష్ లీగ్ 16వ మ్యాచ్‌లో, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ వర్సెస్ సిడ్నీ థండర్ ఒకరితో ఒకరు తలపడ్డారు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రంగంలోకి దిగిన డేవిడ్ వార్నర్ 57 బంతుల్లో 2 సిక్సర్లు, 10 ఫోర్లతో 86 పరుగులు చేశాడు.
దీంతో బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక స్కోరు సాధించాడు. అంతకుముందు 2013లో వార్నర్ 50 పరుగులు చేయడం అత్యధిక స్కోరు.
డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
ఈ లక్ష్యాన్ని ఛేదించిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు 148 పరుగులకే ఆలౌటైంది. దీంతో సిడ్నీ థండర్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే, డేవిడ్ వార్నర్ ను ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. వేలంలో ఎంట్రీ ఇచ్చినా, అతని ఫాం కోల్పోవడంతో ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడవ్వని భారత ఆటగాళ్లు వీరే?
5 ఏళ్లపాటు డేటింగ్.. ఆపై వివాహం.. శాంసన్ వివాహంలో ట్విస్ట్ ఏంటంటే?
షోయబ్ అక్తర్ సీన్ రిపీట్ చేసిన పాక్ బౌలర్