భారత మహిళలను పెండ్లి చేసుకున్న క్రికెటర్లు.. లిస్ట్‌లో నలుగురు పాక్ ఆటగాళ్లు

TV9 Telugu

2 January 2024

గ్లెన్ మాక్స్‌వెల్, షాన్ టైట్ వంటి క్రికెటర్లు ప్రేమ కోసం తమ దేశ సరిహద్దులు దాటారు. వీరంతా భారత దేశ మహిళలతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.

ప్రేమకోసం దేశాలు దాటారు

ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ భారతీయ ఫార్మసిస్ట్ వినీ రామన్‌ను ఒక ప్రైవేట్ వేడుకలో IPL 2021 సీజన్‌కు ముందు వివాహం చేసుకున్నాడు.

గ్లెన్ మాక్స్‌వెల్-విని రామన్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో కలిసి ఉన్న సమయంలో మోడల్ మషూమ్ సింఘాను కలిసి, 2014లో వివాహం చేసుకున్నాడు.

షాన్ టైట్- మషూమ్ సింఘా

పాకిస్తాన్ ప్లేయర్ జహీర్ అబ్బాస్ 1988లో రీటా లూత్రాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు సమీనా అబ్బాస్ అనే కుమార్తె ఉంది.

జహీర్ అబ్బాస్-రీటా లూత్రా

పాకిస్తానీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ 1983లో భారత నటి రీనా రాయ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరికి జన్నత్ అనే కుమార్తె ఉంది.

మొహ్సిన్ ఖాన్-రీనా రాయ్

పాకిస్తానీ ప్లేయర్ షోయబ్ మాలిక్ 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.

షోయబ్ మాలిక్-సానియా మీర్జా

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 2005లో చెన్నైకి చెందిన మద్దిమలర్ రామమూర్తిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ముత్తయ్య మురళీధరన్-మదిమలర్ రామ్మూర్తి

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ 2019లో భారత ఫ్లైట్ ఇంజనీర్ సమియా అర్జూను దుబాయ్‌లో వివాహం చేసుకున్నారు.

హసన్ అలీ-సమియా అర్జూ