2025లో క్రికెట్‌ను ఏలే ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి లుక్కేద్దాం.. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓపెనర్ యశస్వి జైస్వాల్ 2024 అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీమిండియా తరుపున అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.
ఆల్ ఫార్మట్‌లో టీమిండియా యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. రోహిత్ ఫామ్‌లో లేకపోవడం యశస్వికి కలిసొచ్చే అంశం
2025లో జైస్వాల్ హవా కొనసాగుతుందని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు. సంజూ సామ్సన్ టీ20 ఫార్మాట్లో మంచి ప్రదర్శన చేశాడు.
మనోడు తిలక్ వర్మ సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో మాములుగా ఆడలేదు. వరుసగా 2 సెంచరీలు చేసి అందరీ చేత శేభాష్ అని అనిపించుకున్నాడు.
నితీశ్ కుమార్ రెడ్డి BGTలో బ్యాట్‌తో రెచ్చిపోయాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియాలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
2025లో నితీశ్ కుమార్ రెడ్డి కీలక ఆల్ రౌండర్ మారునున్నాడు. బుమ్రా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా సత్తాచాటుతున్నాడు. దీంతో 2025 కూడా బుమ్రా హవా కొనసాగుతుంది.