U19 World Cup 2024: ముషీర్‌ ఖాన్ ఆల్‌రౌండ్‌ షో.. కివీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. 214 పరుగుల తేడాతో ఘన విజయం

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో భారత యువ జట్టు అదరగొడుతోంది. సూపర్ సిక్స్ రౌండ్‌లో భాగంగా మంగళవారం (జనవరి 30) న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.

U19 World Cup 2024: ముషీర్‌ ఖాన్ ఆల్‌రౌండ్‌ షో.. కివీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. 214 పరుగుల తేడాతో ఘన విజయం
Team India
Follow us

|

Updated on: Jan 30, 2024 | 9:03 PM

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో భారత యువ జట్టు అదరగొడుతోంది. సూపర్ సిక్స్ రౌండ్‌లో భాగంగా మంగళవారం (జనవరి 30) న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 214 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. దీంతో ఈ టోర్నీలో వరుసగా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి అజేయంగా కొనసాగుతోంది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో 200కి పైగా పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు సూపర్ సిక్స్ రౌండ్‌లోని మొదటి మ్యాచ్‌లో, ఉదయ్ సహారన్ టీమ్‌ న్యూజిలాండ్ జట్టును 214 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా వరుసగా మూడు మ్యాచ్‌లలో 200 కంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలిచిన రికార్డును నెలకొల్పింది.

ముషీర్ సూపర్ సెంచరీ..

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు చేసింది. జట్టులో మూడో స్థానంలో వచ్చిన ముషీర్ ఖాన్ టోర్నీలో వరుసగా రెండో సెంచరీని నమోదు చేయగా, ఓపెనర్ ఆదర్శ్ సింగ్ కూడా 52 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ఆటతీరుతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ముషీర్ 126 బంతుల్లో 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించిన ముషీర్ రెండు వికెట్లు తీయడం విశేషం.

ఇవి కూడా చదవండి

 81 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

భారత్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల దాటికి కేవలం 81 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 214 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున సౌమ్య పాండే అత్యధిక వికెట్లు పడగొట్టాడు. సౌమ్య పాండే 10 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

టీమ్ ఇండియా:

ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, అరవెల్లి అవనీష్, మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబానీ, సౌమ్య పాండే

న్యూజిలాండ్ జట్టు:

జేమ్స్ నెల్సన్, టామ్ జోన్స్, సనేఖ్ రెడ్డి, లచ్లాన్ స్టాక్‌పోల్, ఆస్కార్ జాక్సన్ (కెప్టెన్), ఆలివర్ తెవాటియా, జాక్ కమ్మింగ్స్, అలెక్స్ థాంప్సన్, ఎవాల్డ్ ష్రోడర్, ర్యాన్ త్సోర్గాస్, మాసన్ క్లార్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

యూపీలో శవాన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు! ఎందుకంటే.. వీడియో
యూపీలో శవాన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు! ఎందుకంటే.. వీడియో
‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు.. అస్సలు ఇలా ఎందుకు చేస్తారంటే.?
‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు.. అస్సలు ఇలా ఎందుకు చేస్తారంటే.?
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
సల్మాన్ పేరుతో ఈవెంట్స్ అంటూ ఫేక్ న్యూస్.. హీరో రియాక్షన్..
సల్మాన్ పేరుతో ఈవెంట్స్ అంటూ ఫేక్ న్యూస్.. హీరో రియాక్షన్..
ECILలో అప్రెంటిస్ పోస్టులు.. ఎలాంటి పరీక్ష లేకుండానే ఎంపిక
ECILలో అప్రెంటిస్ పోస్టులు.. ఎలాంటి పరీక్ష లేకుండానే ఎంపిక
50 రకాల ఫుడ్ ఐటమ్స్‌తో వర సిద్ధి వినాయక అన్న సంతర్పణ.. ఎక్కడంటే
50 రకాల ఫుడ్ ఐటమ్స్‌తో వర సిద్ధి వినాయక అన్న సంతర్పణ.. ఎక్కడంటే
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
MBA తర్వాత ఈ కోర్సులు చేస్తే.. భారీ ప్యాకేజీతో కొలువులు మీ సొంతం
MBA తర్వాత ఈ కోర్సులు చేస్తే.. భారీ ప్యాకేజీతో కొలువులు మీ సొంతం
హీరోల మధ్య మారుతున్న ఈక్వేషన్స్.. హెల్పింగ్ హ్యాండ్ అంటూ..
హీరోల మధ్య మారుతున్న ఈక్వేషన్స్.. హెల్పింగ్ హ్యాండ్ అంటూ..