Mayank Agarwal: ఐసీయూలో టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ మయాంక్ అగర్వాల్‌.. విమానంలో నీళ్లు తాగిన వెంటనే..

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో కర్ణాటక జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతను త్రిపురలోని అగర్తలా ఏఎల్‌ఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు

Mayank Agarwal: ఐసీయూలో టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ మయాంక్ అగర్వాల్‌.. విమానంలో నీళ్లు తాగిన వెంటనే..
Mayank Agarwal
Follow us

|

Updated on: Jan 30, 2024 | 7:51 PM

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో కర్ణాటక జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతను త్రిపురలోని అగర్తలా ఏఎల్‌ఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మయాంక్‌కు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. నిజానికి త్రిపురతో రంజీ మ్యాచ్‌ ఆడిన కర్ణాటక జట్టు తన తదుపరి మ్యాచ్‌ని గుజరాత్‌లోని సూరత్‌లో రైల్వేస్‌తో ఆడాల్సి ఉంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది, దీని కోసం కర్ణాటక రంజీ జట్టు ఆటగాళ్లు విమానంలో ప్రయాణించారు. విమానంలో నీళ్లు తాగి మయాంక్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మయాంక్ నీరు తాగుతున్నప్పుడు అతని గొంతులో మంటగా అనిపించిందని, అలాగే నోరు, నాలుక మండినట్లు అనిపించిందట. ఈ కారణంగానే మయాంక్ మాట్లాడలేక విమానంలోనే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు

సూపర్ ఫామ్ లో మయాంక్..

గత 2 సంవత్సరాలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న 32 ఏళ్ల మయాంక్ అగర్వాల్, 2022 ఫిబ్రవరి-మార్చిలో శ్రీలంకతో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్‌తో బాధపడుతూ భారత జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో మయాంక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన తొలి రంజీ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మయాంక్ ఔటయ్యాడు. దీని తర్వాత, మయాంక్ గుజరాత్ మరియు గోవాపై వరుసగా 2 మ్యాచ్‌లలో సెంచరీలు సాధించాడు. మయాంక్ ఇప్పటివరకు ఆడిన నాలుగు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో 44.28 సగటుతో రెండు సెంచరీలతో సహా 460 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ సిలో కర్ణాటక జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక మయాంక్ తన కెరీర్‌లో భారత్ తరఫున మొత్తం 21 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు, 21 మ్యాచ్‌ల్లో 41.3 సగటుతో 1488 పరుగులు చేశాడు, ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. మయాంక్ టీమ్ ఇండియా తరఫున ఐదు వన్డేలు కూడా ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..