తేలికపాటి పిస్టల్స్.. కానీ కొనే మహిళలేరీ ?

తేలికపాటి పిస్టల్స్.. కానీ కొనే మహిళలేరీ ?

‘ నిర్భయ ‘ ఉదంతం తరువాత కాన్పూర్ లోని ఇండియన్ ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ.. ‘ నిర్భీక్ ‘ పేరిట బరువు లేని, తేలికపాటి రివాల్వర్లను తయారు చేసింది. . 32 బోర్ తో.. కేవలం 500 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ హ్యాండ్ గన్ ముఖ్యంగా మహిళలకు ఉద్దేశించినది. దీన్ని వారు సులభంగా తమ పర్సుల్లోనో, షోల్డర్ బ్యాగ్స్ లోనో అమార్చుకోవచ్ఛు. ఇటీవల హైదరాబాద్ లో దిశ ఘటన అనంతరం అనేకమంది మహిళలు ఇందుకు […]

Pardhasaradhi Peri

|

Dec 05, 2019 | 8:09 PM

‘ నిర్భయ ‘ ఉదంతం తరువాత కాన్పూర్ లోని ఇండియన్ ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ.. ‘ నిర్భీక్ ‘ పేరిట బరువు లేని, తేలికపాటి రివాల్వర్లను తయారు చేసింది. . 32 బోర్ తో.. కేవలం 500 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ హ్యాండ్ గన్ ముఖ్యంగా మహిళలకు ఉద్దేశించినది. దీన్ని వారు సులభంగా తమ పర్సుల్లోనో, షోల్డర్ బ్యాగ్స్ లోనో అమార్చుకోవచ్ఛు. ఇటీవల హైదరాబాద్ లో దిశ ఘటన అనంతరం అనేకమంది మహిళలు ఇందుకు కారకులైన మృగాళ్లను ఉరి తీయాలనో, నిలువునా కాల్చిపారేయాలనో నినాదాలు చేస్తూ వచ్చారు. ఇలాంటి చిన్న పిస్టళ్లకు ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేశారు కూడా. అయితే అమెరికా వంటి దేశాల్లో మాదిరి కాకుండా .. ఈ దేశంలో ఈ విధమైన ఆయుధాల కొనుగోళ్ళకు సవాలక్ష ఆంక్షలున్నాయి. దీంతో మహిళలు పెప్పర్ స్ప్రే, మొబైల్ సేఫ్టీ యాప్స్ వంటి వాటిపై ఆధారపడక తప్పలేదు. ఇప్పటివరకు దేశంలో సుమారు 53 మంది మహిళలు మాత్రమే ‘ నిర్బీక్ ‘ రివాల్వర్లను కొనుగోలు చేశారట.. 2014 జనవరిలోనే ఇవి మార్కెట్లలో ప్రవేశించాయి. మొత్తం దాదాపు పదిహేనువందల పిస్టళ్లు అమ్ముడుపోయాయి. టైటానియం తో తయారైన ఇవి ఒక్కొక్కటి లక్షా 39 వేల రూపాయల ఖరీదు చేస్తుందట.. దీంతో ఇంత ధర పెట్టి కొనేవారు లేక మహిళలు ఉసూరుమంటున్నారు. ఇటీవలే ‘ నిషాంక్ ‘ అనే మరో మోడల్ పిస్టల్ కూడా మార్కెట్లో ఎంటరైంది. హైదరాబాద్ లో 50 నుంచి వందమంది మహిళలకు మాత్రమే గన్ లైసెన్సులు ఉన్నాయట.. అతి తక్కువ బరువై న ఈ పిస్టళ్ల ధర తగ్గితే చాలామంది మహిళలు, యువతులు వీటిని కొనేందుకు ఆసక్తి చూపవచ్చు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu