AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: రోహిత్, కోహ్లీల బాటలోనే.. టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన మరో టీమిండియా క్రికెటర్

సుమారు 11 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా ఐసీసీ టైటిల్ గెలిచింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఆనందం ఇలా ఉంటే మరోవైపు టీమిండియా దిగ్గజాలు ఒక్కొక్కరు టీ20 క్రికెట్ కు దూరమవుతున్నారన్న బాధ క్రికెట్ అభిమానులను కలిచివేస్తోంది. శనివారం టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, మాజీ కెప్టెన్, వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ కొద్ది సేపటకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు..

Team India: రోహిత్, కోహ్లీల బాటలోనే.. టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన మరో టీమిండియా క్రికెటర్
Team India
Basha Shek
|

Updated on: Jun 30, 2024 | 6:18 PM

Share

సుమారు 11 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా ఐసీసీ టైటిల్ గెలిచింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఆనందం ఇలా ఉంటే మరోవైపు టీమిండియా దిగ్గజాలు ఒక్కొక్కరు టీ20 క్రికెట్ కు దూరమవుతున్నారన్న బాధ క్రికెట్ అభిమానులను కలిచివేస్తోంది. శనివారం టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, మాజీ కెప్టెన్, వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ కొద్ది సేపటకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో T20 ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫోటోను షేర్ చేసిన రవీంద్ర జడేజా ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు.. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో నేను అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలుకు తున్నాను. ఇన్నాళ్లూ దూసుకెళ్లే రేసు గుర్రంలా నా దేశం కోసం నిత్యం అత్యుత్తమ ప్రదర్శన అందించడానికి ప్రయత్నించాను. ఇకపై నేను ఇతర ఫార్మాట్లలో కూడా అదే ప్రదర్శనను కొనసాగించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. T20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలవాలన్న నా కల నిజమైంది. ఇది నా T20 అంతర్జాతీయ కెరీర్‌లో అతిపెద్ద ఘనత.. ఈ జ్ఞాపకాలను అందించడంతో పాటు నిరంతరం నన్ను ప్రోత్సహిచిన అందరికీ ధన్యవాదాలు’ అని రిటైర్మెంట్ నోట్ లో తెలిపాడు రవీంద్ర జడేజా.

ఇవి కూడా చదవండి

టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజా ఈ టీ ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఈ టోర్నీలో బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. టోర్నీలో జడేజా 7 ఇన్నింగ్స్‌ల్లో 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. 5 ఇన్నింగ్స్ ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న జడేజా 35 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం జడేజా యధావిధిగా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక ఓవరాల్ గ రవీంద్ర జడేజా ఇప్పటివరకు 74 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. 21.46 సగటుతో 515 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 29.85 సగటుతో 54 వికెట్లు పడగొట్టాడు. ఇందులో జడేజా 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

రవీంద్ర జడేజా ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..