Rohit Sharma: ‘ఇదే మీకు.. మాకు ఉన్న తేడా’.. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌ను మళ్లీ ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్

శనివారం జరిగిన టీ-20 ప్రపంచకప్‌లో ఫైనల్ లో టీమిండియా విజేతగా నిలిచింది. సుమారు 11 ఏళ్లుగా ఊరిస్తోన్న ప్రపంచకప్ ను అందుకుని చరిత్ర సృష్టించింది. ఇక తన కెప్టెన్సీలో కనీసం ఒక ఐసీసీ కప్ అయినా గెలవాలన్న రోహిత్ శర్మ కల కూడా సాకారమైంది. ఈ విజయంలో రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు

Rohit Sharma: 'ఇదే మీకు.. మాకు ఉన్న తేడా'.. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌ను మళ్లీ ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్
Mitchell Marsh, Rohit Sharma
Follow us

|

Updated on: Jun 30, 2024 | 4:15 PM

శనివారం జరిగిన టీ-20 ప్రపంచకప్‌లో ఫైనల్ లో టీమిండియా విజేతగా నిలిచింది. సుమారు 11 ఏళ్లుగా ఊరిస్తోన్న ప్రపంచకప్ ను అందుకుని చరిత్ర సృష్టించింది. ఇక తన కెప్టెన్సీలో కనీసం ఒక ఐసీసీ కప్ అయినా గెలవాలన్న రోహిత్ శర్మ కల కూడా సాకారమైంది. ఈ విజయంలో రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఫైనల్ మ్యాచ్ లో విజయం తర్వాత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ చారిత్రాత్మక విజయం తన శరీరంలో ఇమిడిపోవాలని బార్బడోస్ పిచ్ పై మట్టిని కూడా తిన్నాడు. ఇక ప్రపంచ కప్ అందుకునే క్షణంలో రోహిత్ ఆనందాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ప్రపంచకప్ ట్రోఫీని గుండెలకు హత్తుకుని మరీ విజయాన్ని ఆస్వాదించాడు టీమిండియా కెప్టెన్. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇదే సమయంలో గతేడాది వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత మిచెల్ మార్ష్ ప్రవర్తించిన తీరును క్రికెట్ ఫ్యాన్స్ మళ్లీ గుర్తుకు చేసుకుంటున్నారు. ఫైనల్ లో భారత్ పై విజయం తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు రెచ్చిపోయారు. భారత్ పై విజయం సాధించిన అత్యుత్సాహంలో ఏకంగా ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు మిచెల్ మార్ష్. అంతేకాదు ఆ సమయంలో చేతిలో బీరు బాటిల్ పెట్టుకుని మరీ ఫొటోలకు పోజులిచ్చాడు.

మిచెల్ మార్ష్ ప్రవర్తన టీమిండియా అభిమానులను బాగా కలచివేసింది. దీంతో అతనిపై ఫైరయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఏకి పారేశారు. మళ్లీ ఇప్పుడు ఆ క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రపంచకప్ ట్రోఫీ అందుకున్న తర్వాత రోహత్ శర్మ తన తీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడని క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా కెప్టెన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అప్పట్లో మార్ష్ ఇలా..

అదే సమయంలో గతేడాది మిచెల మార్ష్ తన ప్రవర్తనతో అందరి మనసులు గాయపరచాడంటూ ఇద్దరినీ పోల్చుతూ నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..