AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babar Azam: ‘బాబర్ ఆజం వరుసగా 3 సిక్సర్లు కొడితే ఇకపై టీవీల్లో కనిపించను.. నా ఛానల్ క్లోజ్ చేస్తా’: పాక్ కెప్టెన్‌కి ఓపెన్ ఛాలెంజ్

Basit Ali Challenged Babar Azam: బాబర్ ఆజం ఇంతకుముందు తన స్ట్రైక్ రేట్ గురించి విమర్శలకు స్పందించాడు. తన స్ట్రైక్‌రేట్‌తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అయితే పరిస్థితులకు అనుగుణంగా ఆడుతానని చెప్పుకొచ్చాడు. బాబర్ ఆజం ప్రకారం, తన స్ట్రైక్ రేట్‌ను పదే పదే ప్రశ్నించే వ్యక్తులతో సమస్య ఏమిటో నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు.

Babar Azam: ‘బాబర్ ఆజం వరుసగా 3 సిక్సర్లు కొడితే ఇకపై టీవీల్లో కనిపించను.. నా ఛానల్ క్లోజ్ చేస్తా’: పాక్ కెప్టెన్‌కి ఓపెన్ ఛాలెంజ్
Babar Azam
Venkata Chari
|

Updated on: May 10, 2024 | 10:28 AM

Share

Basit Ali Challenged Babar Azam: పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌కు తన సొంత దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ నుంచి పెద్ద సవాల్ ఎదురైంది. బాబర్ అజామ్ టాప్ జట్లపై వరుసగా 3 సిక్సర్లు కొడితే ఇకపై టీవీల్లోకి రానని, తన యూట్యూబ్ ఛానెల్‌ని కూడా మూసివేస్తానని బాసిత్ అలీ సవాలు చేశాడు.

నిజానికి, మనం బాబర్ అజామ్ గురించి మాట్లాడితే, అతను ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. అయినప్పటికీ, నెమ్మదిగా బ్యాటింగ్ చేసే అతని స్ట్రైక్ రేట్‌కు సంబంధించి ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తుతాయి. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాసిత్ అలీ సవాల్ విసిరాడు.

ఇవి కూడా చదవండి

బాబర్ ఆజంని సవాల్ చేసిన బాసిత్ అలీ..

కాగా, బాబర్ అజామ్‌కు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ పెద్ద సవాల్ విసిరాడు. బాబర్ ఆజం మూడు వరుస సిక్సర్లు బాదితే మళ్లీ టీవీల్లో కనిపించనని తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో సంభాషణ సందర్భంగా, బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘నేను బాబర్ ఆజమ్‌ను సవాలు చేస్తున్నాను. చిన్న టీమ్‌లు అంటే ఐర్లాండ్, యూఎస్‌ఏలపైనా కాదు.. టాప్ టీమ్‌లపైనా బాబర్‌ వరుసగా మూడు సిక్సర్లు కొడితే ఇక టీవీల్లో కనిపించడం మానేస్తా. ఇది కాకుండా, నేను నా యూట్యూబ్ ఛానెల్‌ని కూడా మూసివేస్తాను. ఇంత పెద్ద విషయం చెబుతున్నాను. ఒకవేళ అతను ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తే ముందుకు వచ్చి నేను ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తానని చెప్పు. టీ20 వరల్డ్‌కప్‌లో బాబర్ దీన్ని చేయలేకపోతే ఇకపై ఆడకూడదు’ అంటూ ఛాలెంజ్ ఆశించాడు.

బాబర్ ఆజం ఇంతకుముందు తన స్ట్రైక్ రేట్ గురించి విమర్శలకు స్పందించాడు. తన స్ట్రైక్‌రేట్‌తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అయితే పరిస్థితులకు అనుగుణంగా ఆడుతానని చెప్పుకొచ్చాడు. బాబర్ ఆజం ప్రకారం, తన స్ట్రైక్ రేట్‌ను పదే పదే ప్రశ్నించే వ్యక్తులతో సమస్య ఏమిటో నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజం..

టీ20 ప్రపంచకప్‌నకు ముందు బాబర్ ఆజం మరోసారి పాకిస్థాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. షాహీన్ ఆఫ్రిదిని తొలగించి మళ్లీ కెప్టెన్సీని అప్పగించారు. బాబర్ టీ20 ప్రపంచకప్‌లో ఓపెనింగ్‌లో కనిపించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..