Team India: సెంచూరియన్ నుంచి షాకింగ్ న్యూస్.. పాక్ దెబ్బకు WTC ఫైనల్స్ నుంచి టీమిండియా ఔట్?
WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు ఆసక్తిగా మారింది. పాకిస్తాన్ జట్టుతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో విజయం సాధించేందుకు సౌతాఫ్రికా సిద్ధమైంది. మరో 121 పరుగులు సాధిస్తే తొలి టెస్ట్‌లో గెలిచి, డబ్ల్యూటీసీ ఫైనల్స్ నేరుగా చేరుకోగలదు. అయితే, రెండో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు రేసులో నిలిచాయి.
WTC Finals: సెంచూరియన్ టెస్టులో పాకిస్థాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. అలాగే పాక్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల వెనుకంజలో ఉండడంతో దక్షిణాఫ్రికాకు 148 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే అందించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ఈ టెస్ట్ గెలవాలంటే సౌతాఫ్రికా మరో 121 పరుగులు చేయాల్సి ఉంది. దక్షిణాఫ్రికా తొలి టెస్టులో గెలిస్తే, ఆ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025లో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక రెండో జట్టు స్థానాన్ని మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఇందుకోసం కోసం భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య పోరు సాగుతోంది. కాగా, తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఓడిపోతే టీమిండియాకు ఎక్కువ ఛాన్స్ ఉండేది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంలో పాక్, శ్రీలంక జట్ల సహాయం కావాల్సి ఉంది. ఇప్పుడు పాక్ జట్టు పూర్తిగా చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోంది.
మూడో రోజు వర్షం అంతరాయంతో ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. పాకిస్థాన్ 88/3 స్కోరుతో ఆడటం ప్రారంభించగా, బాబర్ అజామ్ 16 పరుగులతో, సౌద్ షకీల్ 8 పరుగులతో ఇన్నింగ్స్‌ని నడిపించారు. ఇద్దరూ స్కోరును 150కి చేర్చారు. బాబర్ అర్ధశతకం సాధించాడు. 50 పరుగుల వద్ద మార్కో జాన్సన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
బాబర్ పెవిలియన్ చేరే సమయానికి పాకిస్థాన్ స్కోరు 153/4లుగా ఉంది. పాక్ జట్టు 56 పరుగుల వద్ద తర్వాతి 4 వికెట్లు కోల్పోయింది. సౌద్ షకీల్ ఒక చివర నిలబడ్డాడు. కానీ, అతనికి సహకారం అందించేందుకు మరో ఎండ్‌లో ఎవరూ లేరు. మహ్మద్ రిజ్వాన్ 3, సల్మాన్ అఘా 1, అమీర్ జమాల్ 18 పరుగులు చేశారు. 84 పరుగుల వద్ద షకీల్ ఔటయ్యాడు.
నసీమ్ షా, మహ్మద్ అబ్బాస్ ఖాతా కూడా తెరవలేకపోయారు. ఖుర్రం షాజాద్ 9 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 6 వికెట్లు తీశాడు. కగిసో రబాడకు 2 వికెట్లు దక్కాయి. డాన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్ తలో వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..