SMT 2024: యూవీ శిష్యుడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్.. 11 సిక్స్‌లు, 8 ఫోర్లతో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ప్రతిష్ఠాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బ్యాటర్ల హవా నడుస్తోంది. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. తాజాగా మరో రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది.
టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ల జాబితాలో ఇప్పుడు అభిషేక్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సిడిసి ఉర్విల్ పటేల్ రికార్డును సమం చేయడం విశేషం. త్రిపురతో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ కేవలం 28 బంతుల్లోనే రికార్డు సెంచరీ సాధించాడు. దీంతో టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పుడు ఈ రికార్డును పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ వారం వ్యవధిలోనే సమం చేశాడు. రాజ్‌కోట్‌లో మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టీ20 మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. అదే క్రమంలో ప్రపంచంలోనే అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన 3వ బ్యాటర్ గా ప్రపంచ రికార్డు కూడా సాధించాడు.
ఈ జాబితాలో సాహిల్ చౌహాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2024లో ఎస్టోనియా తరఫున ఆడిన సాహిల్ సైప్రస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లోనే ఈ ప్రపంచ రికార్డు సెంచరీని సాధించాడు. దీని తర్వాత ఉర్విల్ పటేల్ (గుజరాత్) 28 బంతుల్లో సెంచరీ సాధించి ఈ ప్రపంచ రికార్డు జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా 28 బంతుల్లో సెంచరీ సాధించి ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు.
వారం రోజుల్లోనే ఉర్విల్ రికార్డు సమం..
FASTEST T20 HUNDRED BY INDIAN PLAYERS:
Abhishek Sharma – 28 balls. Urvil Patel – 28 balls. Rishabh Pant – 32 balls. Rohit Sharma – 35 balls. Urvil Patel – 36 balls. pic.twitter.com/SKx9NfnYaA
— Yuvraj Singh Fans (@Yuvifansclub) December 5, 2024
ఇక మ్యాచ్ విషయానికి వస్తే… పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ 142 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్‌కు అభిషేక్ శర్మ అద్భుత బ్యాటింగ్‌ని ప్రదర్శించాడు. 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ 11 సిక్సర్లు, 8 ఫోర్లతో అజేయంగా 106 పరుగులు చేశాడు. దీని ద్వారా కేవలం 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని పంజాబ్ జట్టుకు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు.
Joint quickest T20s 💯 by an Indian -28 balls Most Sixes in T20s by a Indian in a calendar year- 87(38 inns) Most Hundreds in SMAT- 4
All under the name of Abhishek Sharma 💥🧡#SMAT2024 pic.twitter.com/ForuPSEJxX
— Sunrisers Army (@srhorangearmy) December 5, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి