IPL 2025: రాసి పెట్టుకో సాంబా.. ఐపీఎల్ 2025లో ఫైనల్ చేరే జట్లు ఇవే: శిఖర్ ధావన్
Shikhar Dhawan Predicted Finalists of IPL 2025: ఐపీఎల్ 2025లో ప్రతిరోజూ ఉత్కంఠ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు సాగుతున్నాయి. ఈ క్రమంలో శిఖర్ ధావన్ ఐపీఎల్ 2025లో ఫైనల్ చేరే రెండు జట్లును అంచనా వేశాడు. అయితే, ఈ రెండు జట్లు 18వ సీజన్ తొలి మ్యాచ్‌లో పరాజయం పాలవ్వడం గమనార్హం.

Shikhar Dhawan Predicted Finalists of IPL 2025: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ భారతదేశంలో జరుగుతోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఒక పెద్ద అంచనా వేశాడు. శిఖర్ ధావన్ ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరుకోగల రెండు జట్లను పేర్కొన్నాడు.
స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక X ఖాతా నుంచి ఒక వీడియోను షేర్ చేసింది. దీనిలో శిఖర్ ధావన్ IPL 2025 కోసం రెండు ఫైనలిస్ట్ జట్లను సూచించాడు. ఐపీఎల్ 18వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఫైనలిస్టులుగా బరిలోకి దిగుతాయని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
శిఖర్ ధావన్ కామెంట్స్..
#TATAIPL 2025 Orange Cap holder?🏏#TATAIPL top 2 teams? 🔥
And could we see a Super Over in the final? Kyunki 𝙔𝙚𝙝 𝙄𝙋𝙇 𝙝𝙖𝙞, 𝙮𝙖𝙝𝙖𝙣 𝙨𝙖𝙗 𝙥𝙤𝙨𝙨𝙞𝙗𝙡𝙚 𝙝𝙖𝙞!
The IPL 2025 Starcast share their predictions for the season!
Watch LIVE action:… pic.twitter.com/JuURUOcKXk
— Star Sports (@StarSportsIndia) March 22, 2025
శిఖర్ ధావన్ ఈ అంచనా సరైనదో కాదో కాలమే చెబుతుంది. కానీ, ప్రస్తుతానికి కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 18వ సీజన్‌లో ప్రత్యేక ఆరంభం పొందలేదు. ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూడాల్సి రావడం గమనార్హం.
డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కాగితంపై బలమైన జట్టుగా కనిపించినప్పటికీ, సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ మైదానంలో ఆడింది. అక్కడ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ రెండు బలమైన జట్లు ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఎలా పురోగమిస్తాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..