గ్యాస్ డెలివరీ బాయ్ ఘాతుకం.. మహిళ హత్య, ఆపై ఆత్మహత్య! అసలేం జరిగిందంటే?
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. మహిళతో పరిచయం పెంచుకున్న ఓ గ్యాస్ డెలివరీ బాయ్ వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందని దారుణానికి పాల్పడ్డాడు. మట్లాడుదామని నమ్మకంగా ఆమెను పిలిపించి కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం ఫ్యాన్ కు ఉరి వేసుకుని..

తిరుపతి, జనవరి 6: గ్యాస్ డెలివరీ బాయ్ దారుణానికి పాల్పడ్డాడు. అప్పటికే వివాహమైన సదరు వ్యక్తి మరో మహిళతో చనువుగా ఉండేందుకు యత్నించాడు. అయితే ఆమె అందుకు నిరాకరించడంతో మహిళను హత్య చేసి, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తిరుపతిలోని కొర్లగుంట మారుతీనగర్‌లో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపతిలోని రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అప్పటికే అతనికి వివాహం జరిగింది. అయితే విభేదాల కారణంతో భార్యతో విడిపోయి వేరు వేరుగా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో సోమ శేఖర్ కొర్లగుంటలోని మారుతీనగర్‌లో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవించ సాగాడు. ఈ క్రమంలో తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళ కుటుంబంతోపాటు కొన్ని రోజుల క్రితం జీవనోపాధి కోసం తిరుపతిలోని జీవకోనకు వచ్చారు. భర్త, కుమారుడితో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. సమీపంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సమోసా దుకాణంలో ఆమె పని చేస్తోంది. గ్యాస్ డెలివరీ నిమిత్తం అక్కడికి తరచూ వచ్చే సోమశేఖర్‌తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ బంధానికి ముగింపు పలకాలని భావించిన సదరు మహిళ సోమ శేఖర్‌కు వివరంగా చెప్పింది. అయితే చివరిగా మాట్లాడదామని సోమవారం ఆమెను తన గదికి పిలిపించాడు. అక్కడ వారిద్దరికి మధ్య వాగ్వాధం చోటు చేసుకోవడంతో సోమ శేఖర్ చాకుతో లక్ష్మి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం భయంతో అతడు కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




