Andhra: చిన్నమ్మి, సీనావలి.. పెళ్ళై పిల్లలున్న లవర్స్..! ఉదయాన్నే ఏకాంతంగా కలుసుకున్నారు.. కట్ చేస్తే
వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఒకరు హత్యకు గురికాగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.. మార్కాపురంజిల్లా కట్టకిండపల్లిలో జరిగిన ఈ ఘటనలో వివాహిత మహిళ చిన్నమ్మి హత్యకు గురికాగా, ఏఆర్ కానిస్టేబుల్ సీనావలి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మార్కాపురంజిల్లా కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం కట్టకిందపల్లిలో దారుణం చోటు చేసుకుంది.. వివాహేతర సంబంధంలో ఉన్న ఓ జంట మధ్య ఘర్షణ జరిగింది… ఈ ఘటనలో 32 ఏళ్ళ చిన్నమ్మి హత్యకు గురైంది.. చిన్నమ్మి తలను గోడకేసి కొట్టి హత్య చేసిన ఆమెకు సన్నిహితంగా ఉంటున్న ఏఆర్ కానిస్టేబుల్ సీనావలి అనంతరం భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. వివరాల ప్రకారం.. ప్రకాశంజిల్లా అద్దంకి మండలం మైలవరం గ్రామానికి చెందిన దూదేకుల సీనావలి ఏఆర్ కానిస్టేబుల్‌గా ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్నాడు. మార్కాపురంజిల్లా వెలిగండ్ల మండలంలో కొంత పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా ఒంగోలులో ఉండే సీనావలి ఇటీవల కొన్ని రోజులుగా సెలవు పెట్టి కట్టకిందపల్లి గ్రామంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన వివాహిత మహిళ చిన్నమ్మితో పరిచయం ఏర్పడింది.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడి ఇద్దరూ అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు. పొలం పనులకు కూలి కోసం వచ్చే క్రమంలో బండ్లమూడి నాగజ్యోతి అలియాస్ చిన్మమ్మి (32)తో సీనావలి సన్నిహితంగా ఉంటూ కలిసిమెలిసి ఉండేవాడు. చిన్నమ్మికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. సీనయ్యకు కూడా వివాహమై భార్యా, పిల్లలు ఉన్నారు…
ఈ క్రమంలో యధాలాపంగా పొలం పనులకు వచ్చిన చిన్నమ్మి కట్టకిందపల్లిలో అద్దె ఇంటిలో ఉంటున్న కానిస్టేబుల్ సీనావలి ఉంటున్న ఇంటికి వచ్చింది. ఆ సమయంలో మద్యం తాగి ఉన్న సీనావలికి, చిన్నమికి మధ్య వాగ్వివాదం జరిగింది.. ఇది కాస్తా గొడవగా మారి ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న సీనావలి చిన్నమ్మి తలను గోడకేసి పలుమార్లు బాదడంతో తలపగిలి తీవ్ర రక్తస్రావమై చిన్నమ్మి అక్కడికిక్కడే చనిపోయింది. దీంతో మత్తు దిగిపోయిన సీనావలి తనను చిన్నమ్మి బంధువులు కొడతారన్న భయంతో పొలంలో చల్లేందుకు తీసుకువచ్చిన పురుగుల మందును తాగేశాడు. ఈ విషయాన్ని చాలా సేపటివరకు ఎవరూ గుర్తించలేదు. ఒకవైపు చిన్నమ్మి మతృదేహం, మరోవైపు పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న సీనావలిలను సాయంత్రం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆపస్మారక స్థితిలో ఉన్న సీనావలిని ఆసుపత్రికి తరలించారు.. అప్పటికే చనిపోయిన చిన్నమ్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నమ్మి మృతితో బంధువులు, ఆమె ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దారుణ ఘటన ఎలా జరిగిందో తమకు తెలియదని, చిన్నమ్మి చనిపోయిందని గ్రామస్థులు చెప్పడంతో వచ్చామని చిన్నమ్మి తల్లి రామలక్ష్మమ్మ కన్నీరుమున్నీరవుతోంది.
ఈ ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెలిగండ్ల ఎస్సై కృష్ణపావని, పామూరు సీఐ మాకినేని శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సీనావలిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ సీనావలి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. చిన్నమ్మిని హత్యచేసి అనంతరం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సీనావలి ఈ నెల ఒకటోతేది నుంచి సెలవులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెలిగండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
