Inter Practical Exams 2026: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ ప్రాక్టికల్స్..!
రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి..

అమరావతి, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు.
అయితే ఈసారి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా జూనియర్ కాలేజీలను ఆదేశించారు. ఈ మేకు పబ్లిక్ పరీక్షలు, ఇంటర్మీడియట్ విద్యలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై జనవరి 5న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్ జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఈ సీసీ కెమెరాలను బోర్డులోని కార్యాలయానికి అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్‌లో అవకతవకల కట్టడికి ఈ మేరకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని, వీటిల్లో సిట్టింగ్ స్క్వాడ్‌ను పెడతామని బోర్డు తెలిపింది. రాష్ట్ర కార్యాలయం నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తామని తెలిపింది. కాగా ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఆయా తేదీల్లో జరగనున్నాయి. అయితే ఇంర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఈ ఏడాది పలు మార్పులతో జరగనున్నాయి. ఈ కొత్త మార్పులను అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకొని విధులు నిర్వర్తించాలని బోర్డు సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




