Shubman Gill : గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఆడుతున్న గిల్.. డకౌట్ అవ్వడానికి కూడా ఇంత బిల్డప్ అవసరమా బ్రో?
Shubman Gill : టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించినప్పటికీ, బ్యాట్‌తో పరుగులు చేయడంలో గిల్ తీవ్రంగా తడబడుతున్నాడు. న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో భారత జట్టును నడిపించాల్సిన బాధ్యత గిల్‌పై ఉంది.

Shubman Gill : టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించినప్పటికీ, బ్యాట్‌తో పరుగులు చేయడంలో గిల్ తీవ్రంగా తడబడుతున్నాడు. న్యూజిలాండ్‌తో కీలకమైన వన్డే సిరీస్ ప్రారంభానికి కేవలం ఐదు రోజుల ముందు విజయ్ హజారే ట్రోఫీలో గిల్ దారుణంగా విఫలం కావడం అభిమానులను, సెలెక్టర్లను కలవరపెడుతోంది.
న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో భారత జట్టును నడిపించాల్సిన బాధ్యత గిల్‌పై ఉంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ కోసం విజయ్ హజారే ట్రోఫీలో గోవాపై బరిలోకి దిగిన గిల్, కేవలం 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. రెండు ఫోర్లు కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా, వాసుకి కౌశిక్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో గిల్ బ్యాటింగ్ టెక్నిక్‌పై మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి.
శుభ్‌మన్ గిల్ గతేడాది ఫిబ్రవరి 20 నుంచి వైట్ బాల్ క్రికెట్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. గత 8 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అతని అత్యధిక స్కోరు కేవలం 46 పరుగులు మాత్రమే. కేవలం వన్డేల్లోనే కాదు, టీ20ల్లో కూడా గిల్ పరిస్థితి ఏమీ బాగోలేదు. గత 15 టీ20 మ్యాచ్‌ల్లో వరుసగా విఫలం కావడంతో, టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి అతడిని తప్పించారు. వైట్ బాల్ క్రికెట్‌లో (వన్డే + టీ20) కలిపి వరుసగా 23 మ్యాచ్‌ల్లో గిల్ విఫలం కావడం ఒక రికార్డుగా మారింది.
ఒకవైపు రెండు నెలల విరామం తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో వీరవిహారం చేస్తుంటే, మరోవైపు టీమిండియా కెప్టెన్లు గిల్, సూర్యకుమార్ యాదవ్ మాత్రం వరుసగా విఫలమవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో సూర్య కేవలం 24 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కివీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో ఓపెనర్, కెప్టెన్ అయిన గిల్ ఫామ్ లేకపోవడం టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే ఫామ్ కొనసాగితే జట్టులో గిల్ స్థానానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
