Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ ఊచకోత..15వ బర్త్‌డే లోపు భారత్‌కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా?
Vaibhav Suryavanshi : అండర్-19 వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లతో వైభవ్ 68 పరుగులు చేసి ఊచకోత కోశాడు. విదేశీ గడ్డపై, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై ఈ రేంజ్ హిట్టింగ్ చూసి క్రికెట్ పండితులు నోరెళ్లబెడుతున్నారు.

Vaibhav Suryavanshi : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం అంతా ఒకే ఒక పేరు జపిస్తోంది.. అదే వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల వయసులోనే దిగ్గజ బ్యాటర్లను సైతం ఆశ్చర్యపరిచేలా సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ చిన్నోడు, 2026 సంవత్సరాన్ని కూడా అదిరిపోయే రేంజ్‌లో మొదలుపెట్టాడు. క్యాలెండర్ మారింది కానీ వైభవ్ సూర్యవంశీ బ్యాట్ మాత్రం మారలేదు, అదే వేగం.. అదే పవర్!
వైభవ్ సూర్యవంశీ గతేడాది ఐపీఎల్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు 2026 ప్రారంభంలోనే సౌతాఫ్రికా పర్యటనలో తన విశ్వరూపాన్ని చూపించాడు. అక్కడ జరుగుతున్న అండర్-19 వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లతో 68 పరుగులు చేసి ఊచకోత కోశాడు. విదేశీ గడ్డపై, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై ఈ రేంజ్ హిట్టింగ్ చూసి క్రికెట్ పండితులు నోరెళ్లబెడుతున్నారు. ఇది సౌతాఫ్రికాలో వైభవ్‌కు నమోదైన తొలి 50+ స్కోరు కావడం విశేషం.
వైభవ్ సూర్యవంశీ కేవలం పరుగులు సాధించడమే కాకుండా, తన దేశం కోసం ఒక భారీ కానుకను సిద్ధం చేస్తున్నాడు. మార్చి 27న వైభవ్ తన 15వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. అయితే ఆ పర్వదినం కంటే ముందే భారత్‌కు అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీని గిఫ్ట్‌గా ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో వైభవ్ తన బ్యాట్‌తో గనుక భారత్‌ను విజేతగా నిలబెడితే, అతి చిన్న వయసులో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
వైభవ్ ఆడుతున్న విధానం చూస్తుంటే టీమిండియాకు మరో విద్వంసకర ఓపెనర్ దొరికాడనే భావన కలుగుతోంది. గతేడాది మొత్తం రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టిన వైభవ్, ఇప్పుడు అదే ఫామ్‌ను 2026కి కూడా మోసుకొచ్చాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న తరుణంలో, వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించనున్నాడు. తన 15వ ఏట అడుగుపెట్టకముందే ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త శకాన్ని లిఖించడానికి ఈ బీహార్ కుర్రాడు సర్వసిద్ధమయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
