IPL 2025 Points Table: ఢిల్లీ ఉత్కంఠ విజయం.. కట్‌చేస్తే.. పాయింట్ల పట్టికలో కీలక మార్పు..
IPL 2025 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరుగుతుంది. గత సీజన్ లాగే, ఈసారి కూడా 10 జట్లు టోర్నమెంట్‌లో పాల్గొనబోతున్నాయి. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో ఏ జట్టు అగ్రస్థానంలో ఉందో తెలుసుకుందాం..

IPL 2025 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరుగుతుంది. గత సీజన్ లాగే, ఈసారి కూడా 10 జట్లు టోర్నమెంట్‌లో పాల్గొనబోతున్నాయి. IPL 2025 లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగగా, చివరి లీగ్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది.
ప్లేఆఫ్ మ్యాచ్‌లు హైదరాబాద్, కోల్‌కతాలో జరుగుతాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు గరిష్టంగా 5 సార్లు టోర్నమెంట్‌ను గెలుచుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో IPL 2025 పాయింట్ల పట్టికను ఓసారి పరిశీలిద్దాం..
IPL 2025 పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది?
1) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 1, గెలుపు – 1, ఓటమి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నికర రన్ రేట్ – 2.200)
2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 1, గెలుపు – 1, ఓటమి – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 2.137)
3) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 1, గెలుపు – 1, ఓటమి – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 0.493)
4) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 1, గెలుపు – 1, ఓటమి – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్= – 0.371)
5) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 1, విజయాలు – 0, ఓటములు – 1, టైలు – 0, పాయింట్లు – 0, నెట్ రన్ రేట్= -0.371)
6) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 1, గెలుపు – 0, ఓటమి – 1, టై – 0, పాయింట్లు – 0, నెట్ రన్ రేట్= -0.493)
7) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 1, గెలుపు – 0, ఓటమి – 1, టై – 0, పాయింట్లు – 0, నెట్ రన్ రేట్ = -2.137)
8) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 1, గెలుపు – 0, ఓటమి – 1, టై – 0, పాయింట్లు – 0, నెట్ రన్ రేట్= -2.200)
9) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 0, విజయాలు – 0, ఓటములు – 0, టైలు – 0, పాయింట్లు – 0, నెట్ రన్ రేట్ – 0)
10) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 0, విజయాలు – 0, ఓటములు – 0, టైలు – 0, పాయింట్లు – 0, నెట్ రన్ రేట్ – 0).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..