MI vs CSK 2024 IPL Live Streaming: మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధం.. వాంఖడేలో చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన ముంబై..

MI vs CSK 2024 IPL Live Streaming: ముంబై, చెన్నై రెండూ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లు. ఇరు జట్లు ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య పోటీ కూడా విపరీతంగా ఉంది. ఐపీఎల్‌లో ఇరుజట్ల మధ్య 36 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై 20 సార్లు గెలుపొందగా, చెన్నై 16 సార్లు గెలిచింది.

MI vs CSK 2024 IPL Live Streaming: మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధం.. వాంఖడేలో చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన ముంబై..
Mi Vs Csk Preview
Follow us
Venkata Chari

|

Updated on: Apr 14, 2024 | 8:06 AM

Mumbai Indians vs Chenai Super Kings IPL 2024 Live Streaming: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఉన్న ముంబై ఇండియన్స్ IPL 2024లో విజయాల ట్రాక్‌లోకి తిరిగి వచ్చింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంత మైదానంలో తలపడేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2024లో ఏప్రిల్ 14న వాంఖడే స్టేడియంలో ముంబై, చెన్నై జట్లు తలపడనున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఇది మూడో మ్యాచ్. బయటి మైదానాల్లో ఇప్పటి వరకు ఎలాంటి విజయం సాధించలేదు. ఇటువంటి పరిస్థితిలో బహుశా వాంఖడేలో చివరిసారిగా ఆడుతున్న ఎంఎస్ ధోని, ఈ సీజన్‌లో ముంబైలోనే తన జట్టు తన మొదటి విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాడు.

MI vs CSK హెడ్ టు హెడ్ రికార్డ్..

ముంబై, చెన్నై రెండూ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లు. ఇరు జట్లు ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య పోటీ కూడా విపరీతంగా ఉంది. ఐపీఎల్‌లో ఇరుజట్ల మధ్య 36 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై 20 సార్లు గెలుపొందగా, చెన్నై 16 సార్లు గెలిచింది. గత సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగగా, రెండూ చెన్నై పేరిటే విజయాలు వచ్చాయి.

ఐపీఎల్‌లో ముంబై, చెన్నై జట్లు చాలా భిన్నంగా ఉన్నాయి. చెన్నై వరుసగా రెండు విజయాలతో తన ఖాతా తెరిచింది. అయితే, దీని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలో సొంత మైదనానికి దూరంగా ఓడిపోయింది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి, ఆ జట్టు మళ్లీ విజయాన్ని రుచి చూసింది. మొదటి నాలుగు జట్లలో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ముంబై వరుసగా మూడు పరాజయాలతో శుభారంభం చేసింది. కానీ, సొంతమైదానంలో ఢిల్లీ, ఆర్‌సీబీలను ఓడించి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

MI vs CSK 2024 మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..

ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య IPL 2024 మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య IPL 20244 మ్యాచ్ జరుగుతుంది.

ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య IPL 2024 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

IPL 2024 మ్యాచ్ ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య ఏప్రిల్ 14 రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది.

ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య జరిగే IPL 2024 మ్యాచ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం ఏ ఛానెల్‌లో జరుగుతుంది?

ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య IPL 2024 మ్యాచ్ టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య IPL 2024 మ్యాచ్ ఉచిత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఏ యాప్‌లో ఉంటుంది?

ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య IPL 2024 మ్యాచ్ యొక్క ఉచిత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ Jio సినిమా యాప్‌లో ఉంటుంది.

MI vs CSK మ్యాచ్ కోసం ఇరుజట్ల స్క్వాడ్స్..

ముంబై ఇండియన్స్ స్క్వాడ్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయాస్ గోపాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వీనా మద్వాల్ , షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్.

చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణా, ముఖేష్ చౌదరి, శార్దూల్ ఠాకూర్, షీకుల్ ఠాకూర్ . సమీర్ రిజ్వీ, డెవాన్ కాన్వే, ముస్తాఫిజుర్ రెహమాన్, అజయ్ మండల్, ప్రశాంత్ సోలంకి, సిమర్జిత్ సింగ్, రాజవర్ధన్ హంగర్గేకర్, మతిషా పతిరానా, నిశాంత్ సింధు, ఆరావళి అవనీష్.

మరిన్ని  క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..