IPL 2025 Points Table: పంజాబ్‌పై ఓటమితో లక్నోకు బిగ్ షాక్.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
IPL 2025 Points Table updated after PBKS vs LSG and KKR vs RR: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టును 1 పరుగు తేడాతో ఓడించింది. ఇక రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు లక్నోను 37 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో కీలక మార్పలు చోటు చేసుకున్నాయి.

IPL 2025 Points Table updated after PBKS vs LSG and KKR vs RR: ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్‌లో భాగంగా 54వ మ్యాచ్ ధర్మశాల మైదానంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 236 పరుగుల భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ జట్టు 11వ మ్యాచ్‌లో ఏడవ విజయాన్ని నమోదు చేసింది. మొత్తంగా 15 పాయింట్లతో నాల్గవ స్థానం నుంచి నేరుగా రెండవ స్థానానికి చేరుకుంది. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో 11వ మ్యాచ్‌లో ఆరో ఓటమిని చవిచూసింది. లక్నో జట్టు ఏడో స్థానంలో ఉంది. దీంతో, లక్నోకు ప్లేఆఫ్స్ తలుపులు దాదాపు మూసుకుపోయినట్లే.
ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలనే కోల్‌కతా ఆశలు సజీవం..
ఆదివారం జరిగిన డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా రాజస్థాన్ రాయల్స్‌ను వారి సొంత మైదానంలో ఒక పరుగు తేడాతో ఓడించింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఆశలు సజీవంగా ఉన్నాయి. కోల్‌కతా జట్టు ఇప్పుడు 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 11 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది. ఆ జట్టు తొమ్మిది ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉంది. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ నుంచి తప్పుకుంది.
IPL 2025లో 54వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక..
1) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 8, ఓడినవి – 3, పాయింట్లు – 16, నెట్ రన్ రేట్ – +0.482)
2) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 7, ఓడినవి – 3, ఫలితం తేలనివి – 1, పాయింట్లు – 15, నెట్ రన్ రేట్ +0.376)
3) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 7, ఓడినవి – 4, పాయింట్లు – 14, నెట్ రన్ రేట్ – +1.274)
4) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 7, ఓడినవి – 3, పాయింట్లు – 14, నెట్ రన్ రేట్ – +0.867)
5) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 6, ఓడినవి – 4, పాయింట్లు – 12, నెట్ రన్ రేట్ – +0.362)
6) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 5, ఓడినవి – 5, ఫలితం తేలనిది – 1, పాయింట్లు – 11, నెట్ రన్ రేట్ – +0.249)
7) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 5, ఓడినవి – 6, పాయింట్లు – 10, నెట్ రన్ రేట్ – -0.469)
8) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 12, గెలుపు – 3, ఓడినవి – 9, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – -0.718)
9) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 3, ఓడినవి – 7, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – -1.192)
10) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 2, ఓటమి – 9, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – -1.117)
IPL 2025 లో టాప్ 5 బ్యాట్స్ మెన్లు..
1. విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 11 మ్యాచ్‌లు, 505 పరుగులు
2. సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) – 10 మ్యాచ్‌లు, 504 పరుగులు
3. సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్) – 11 మ్యాచ్‌లు, 475 పరుగులు
4. యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్) – 12 మ్యాచ్‌లు, 473 పరుగులు
5. జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్) – 10 మ్యాచ్‌లు, 470 పరుగులు
IPL 2025 లో టాప్ 5 బౌలర్లు..
1. ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ టైటాన్స్) – 10 మ్యాచ్‌లు, 19 వికెట్లు
2. జోష్ హాజిల్‌వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 10 మ్యాచ్‌లు, 18 వికెట్లు
3. అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్) – 11 మ్యాచ్‌లు, 16 వికెట్లు
4. నూర్ అహ్మద్ (చెన్నై సూపర్ కింగ్స్) – 11 మ్యాచ్‌లు, 16 వికెట్లు
5. ట్రెంట్ బౌల్ట్ (ముంబై ఇండియన్స్) – 11 మ్యాచ్‌లు, 16 వికెట్లు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








