IPL 2025: ‘ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే’.. వైభవ్ సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Key Statement After Brilliant Century: ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. ఎవరికీ భయపడనంటూ చెప్పుకొచ్చాడు. వైభవ్ తన సెంచరీతో ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు.

Vaibhav Suryavanshi Key Statement After Brilliant Century: 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోసి, ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు వైభవ్ సూర్యవంశీ. తన మూడో ఐపీఎల్ మ్యాచ్‌లో వైభవ్ ఈ ఘనత సాధించడం గమనార్హం. అతను కేవలం 35 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో, ఈ బ్యాటర్ 7 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టాడు.
నేను ఎవరికీ భయపడను: వైభవ్ సూర్యవంశీ..
వైభవ్ సూర్యవంశీని ఈ సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ.. ఇది నాకు గొప్ప అనుభూతి. ఇది ఐపీఎల్‌లో నా తొలి సెంచరీ. నేను ఈ ఘనతను మూడవ ఇన్నింగ్స్‌లో సాధించాను. శిక్షణా సెషన్లలో నేను పడిన కష్టానికి ఫలితం లభించింది. నేను బంతిని చూస్తూ కొట్టేస్తున్నాను. జైస్వాల్‌తో బ్యాటింగ్ చేయడం సరదాగా ఉంది. అతను నాకు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెబుతున్నాడు. ఐపీఎల్‌లో సెంచరీ సాధించడం ఒక కల లాంటిది. ఈరోజు నేను దానిని సాధించాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. నా దృష్టి అంతా ఆడటం మీదే ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.
వైభవ్ తన సెంచరీతో ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు. అదే సమయంలో టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఇరు జట్లు:
Vaibhav Suryavanshi Said “Watching Virat Kohli play fuels my passion and drive. He’s the reason I push my limits every single day.” #GTvsRR #VaibhavSuryavanshi pic.twitter.com/IUft34EJrJ
— Rocky. (@KohliInspirer) April 28, 2025
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీం జనత్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్ చరక్.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్స్..
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: ఇషాంత్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, అర్షద్ ఖాన్, దసున్ షనక.
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: శుభమ్ దూబే, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, తుషార్ దేశ్‌పాండే, కునాల్ సింగ్ రాథోడ్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..