AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మెడికల్ మిరకిల్.. శిష్యుడి సెంచరీతో వీల్‌చైర్ నుండి లేచిన కోచ్! గూస్ బంప్స్ వీడియో

వీల్ చెయిర్ సహాయంతో ఉండిన రాహుల్ ద్రవిడ్, శిష్యుడు వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీ చూసి ఆనందంతో లేచి నిలిచాడు. 38 బంతుల్లో 101 పరుగులు చేసిన వైభవ్ స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. ద్రవిడ్ చూపిన భావోద్వేగం, శిష్యుడు చూపిన ప్రతిభ ఆటలో నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబించాయి. ఈ సంఘటన గురుశిష్య బంధానికి అద్భుత ఉదాహరణగా నిలిచింది.

Video: మెడికల్ మిరకిల్.. శిష్యుడి సెంచరీతో వీల్‌చైర్ నుండి లేచిన కోచ్! గూస్ బంప్స్ వీడియో
Rahul Dravid Vaibhav Suryvanshi
Narsimha
|

Updated on: Apr 29, 2025 | 8:06 AM

Share

అంకితభావానికి, నిబద్ధతకు మారు పేరు అయిన రాహుల్ ద్రవిడ్ మరోసారి తన ప్రత్యేకతను రుజువు చేశాడు. ఆటగాడిగా ఎన్నో సార్లు తన మూర్తిరూపం చూపించిన ద్రవిడ్, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్‌గా కూడా అదే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నాడు. తను పూర్తిగా ఆరోగ్యంగా లేకపోయినా కూడా, కాలు బాగా నొప్పి ఉన్నా, చేతి కర్రల సాయంతో నడుచుకుంటూ, వీల్ చెయిర్ సాయంతో మైదానంలోకి వచ్చి తన ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ విజయానికి ప్రతీక్షణం శ్రమిస్తున్న ద్రవిడ్, తన ఆటగాళ్లను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నాడు.

ఈ క్రమంలో తాజాగా 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ప్రదర్శనతో ద్రవిడ్ విశ్వాసాన్ని నిలబెట్టాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో 101 పరుగులు చేసిన వైభవ్, ఒక్కసారిగా స్టేడియం మొత్తం ఉర్రూతలూగేలా చేశాడు. బౌండరీలు, సిక్సర్లు సముద్రంలా ఎగిసిపడటంతో ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు, ఈలులతో స్టేడియాన్ని కంపింపజేశారు. 17 బంతుల్లోనే అరుదైన హాఫ్ సెంచరీని సాధించి, 35 బంతుల్లోనే తన ఐపీఎల్ తొలి శతకం కొట్టి పలు రికార్డులు కూడా నెలకొల్పాడు. వరుసగా 6,4,6,4,4,6లు కొట్టి ఒక ఓవర్‌లోనే 30 పరుగులు రాబట్టిన వైభవ్, చివరకు తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. దీనితో స్టేడియం మొత్తం పింక్ జెండాలతో, వైభవ్ నినాదాలతో మెరిసిపోయింది. ప్రేక్షకులు, ఆటగాళ్లు అంతా లేచి నిలబడి వైభవ్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

ఈ అద్భుత ఘట్టం మధ్యలో, వీల్ చెయిర్‌లో ఉన్న రాహుల్ ద్రవిడ్ కూడా తన కాళ్ళ నొప్పిని మరచి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ తన శిష్యుడిని అభినందించాడు. ఒక్కసారిగా లేచిన ద్రవిడ్ కుదుటకు గురైనా, తను బ్యాలెన్స్ చేసుకుని గర్వంతో నిలబడి, విజయ చిహ్నాన్ని చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఉప్పొంగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాహుల్ ద్రవిడ్ లాంటి లెజెండ్‌ని కూడా లేచి నిలబడేలా చేసిన వైభవ్ సూర్యవంశీపై క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిజంగా ఇది క్రీడాస్ఫూర్తికి, గురుశిష్య పరంపర గౌరవానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.

ఈ విజయాన్ని చూస్తూ రాహుల్ ద్రవిడ్ చూపిన భావోద్వేగం, వైభవ్ సూర్యవంశీ చూపిన ప్రతిభ, ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని ప్రతిబింబించాయి. క్రీడలో కేవలం ప్రతిభ మాత్రమే కాదు, అంకితభావం, గౌరవం, శ్రమలే నిజమైన విజయం దారితీస్తాయనే సందేశాన్ని ఈ సంఘటన ప్రపంచానికి ఇచ్చింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..