Kavya Maran Video: అయ్యో.! అక్కను ఏడిపించేశారుగా.. SRH ఓటమితో కావ్యపాప కన్నీళ్లు.. ఫ్యాన్స్ హార్ట్..

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, Final: ఐపీఎల్ 2024 ఫైనల్ ముగిసింది. చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 57 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. కేకేఆర్ జట్టు తొలుత బంతితో, తర్వాత బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. హైదరాబాద్ జట్టు 113 పరుగులకు ఆలౌటైంది. అయితే, KKR జట్టు కేవలం 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది.

Kavya Maran Video: అయ్యో.! అక్కను ఏడిపించేశారుగా.. SRH ఓటమితో కావ్యపాప కన్నీళ్లు.. ఫ్యాన్స్ హార్ట్..
Kavya Maran
Follow us
Venkata Chari

|

Updated on: May 27, 2024 | 7:25 AM

Kavya Maran Cried: ఐపీఎల్ 2024 ఫైనల్ ముగిసింది. చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 57 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. కేకేఆర్ జట్టు తొలుత బంతితో, తర్వాత బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. హైదరాబాద్ జట్టు 113 పరుగులకు ఆలౌటైంది. అయితే, KKR జట్టు కేవలం 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. దీంతో ఈ విజయం తర్వాత షారుక్ ఖాన్, అతని కుటుంబం మొత్తం, KKR ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మాత్రం బోరున విలపించింది.

కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్..

కావ్య మారన్ మొదటి నుంచి స్టాండ్స్‌లో కూర్చొని తన టీమ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే, ఫైనల్ ఓటమి తర్వాత ఆమె కన్నీరు పెట్టుకుంది. హైదరాబాద్ ఓడిపోవడంతో కావ్య మారన్ ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పక్కనున్న ఆమె స్నేహితులు కన్నీళ్లు తుడిచారు. అయితే, ఆ తర్వాత కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. కావ్యకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ గురించి మాట్లాడితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేయడంతో జట్టు మొత్తం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ తరపున మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా 1 వికెట్, హర్షిత్ రాణా 2 వికెట్లు, సునీల్ నరైన్ 1 వికెట్, ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ తరపున ఐడెన్‌ మార్క్రామ్‌ 20, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 13, హెన్రీ క్లాసెన్‌ 16, కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 24 పరుగులు చేశారు. దీంతో మొత్తం జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది.

KKR తరపున రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్ ఓపెనర్లుగా వచ్చారు. అయితే, నరైన్ 6 పరుగులు చేసి వెంటనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ వచ్చాడు. వెంకటేష్ 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి చివరి వరకు నాటౌట్‌గా ఉండి 57 పరుగుల తేడాతో KKR జట్టుకు విజయాన్ని అందించాడు. కేకేఆర్ జట్టు 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!