AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : మైదానంలో సిక్సర్ల సునామీ.. గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం!

Hardik Pandya : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్‌తోనూ, ఇటు తన రొమాంటిక్ సైడ్‌తోనూ దుమ్ములేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో హార్దిక్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, భారత్ తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

Hardik Pandya : మైదానంలో సిక్సర్ల సునామీ.. గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం!
Hardiks Romantic Flying Kisses
Rakesh
|

Updated on: Dec 20, 2025 | 11:45 AM

Share

Hardik Pandya : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్‌తోనూ, ఇటు తన రొమాంటిక్ సైడ్‌తోనూ దుమ్ములేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో హార్దిక్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, భారత్ తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. భారత్ ఈ మ్యాచ్‌లో 30 పరుగులతో గెలవడమే కాకుండా, సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. అయితే, స్టేడియంలో హార్దిక్ బ్యాటింగ్ కంటే అతను తన ప్రేయసికి ఇచ్చిన ముద్దులే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

హార్దిక్ తన రికార్డు హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే, గ్యాలరీలో కూర్చుని తనను ఉత్సాహపరుస్తున్న ప్రేయసి మహీకా శర్మ వైపు చూస్తూ ముద్దుల వర్షం కురిపించాడు. తన ప్రియుడి మెరుపు ఇన్నింగ్స్‌ను చూసి మురిసిపోయిన మహీకా, ఎంతో ఆనందంతో రియాక్ట్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆసియా కప్ 2025లో గాయపడిన తర్వాత హార్దిక్‌కు ఇదే మొదటి అంతర్జాతీయ సిరీస్. రీ-ఎంట్రీలోనే 186 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టడమే కాకుండా, మూడు వికెట్లు కూడా పడగొట్టి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు.

మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. తను రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశానన్న విషయం తనకు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్ళే వరకు తెలియదట. “నేను అవుట్ అయి వెనక్కి వెళ్ళినప్పుడు మా సోషల్ మీడియా టీమ్ ఈ విషయం చెప్పింది. నా మొదటి రియాక్షన్ ఏంటంటే.. ఛా, ఫస్ట్ ప్లేస్ మిస్ అయ్యానా! అని. కానీ యువరాజ్ పాజీ (12 బంతుల్లో 50) రికార్డు ఇంకా పదిలంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది” అని సరదాగా వ్యాఖ్యానించాడు.

వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ముందు హార్దిక్ ఇలాంటి భీభత్సమైన ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కొండంత బలాన్నిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ తన మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న అమెరికాతో ఆడనుంది. ఆటలోనూ, ప్రేమలోనూ హార్దిక్ చూపిస్తున్న ఈ జోరు చూస్తుంటే వరల్డ్ కప్‌లో ప్రత్యర్థులకు చుక్కలు కనిపించడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..