Fastest 50s in T20 Cricket: 9 బంతుల్లోనే 50 రన్స్..వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
Fastest 50s in T20 Cricket: క్రికెట్ అంటేనే ఒకప్పుడు నిదానంగా ఆడే ఆట.. కానీ టీ20లు వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే బంతిని బౌండరీ అవతల పడేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. కేవలం పది నిమిషాల్లోనే హాఫ్ సెంచరీలు బాదేస్తూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నారు.

Fastest 50s in T20 Cricket: క్రికెట్ అంటేనే ఒకప్పుడు నిదానంగా ఆడే ఆట.. కానీ టీ20లు వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే బంతిని బౌండరీ అవతల పడేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. కేవలం పది నిమిషాల్లోనే హాఫ్ సెంచరీలు బాదేస్తూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నారు. 2005లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో మంది వీరులు తమ మెరుపు బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ రికార్డు నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఐరీ పేరిట ఉంది. 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై అతను కేవలం 9 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అయితే, ఆ మ్యాచ్ జరిగిన గ్రౌండ్ చిన్నదిగా ఉండటం, ప్రత్యర్థి జట్టు బలహీనంగా ఉండటంతో దీనిపై కొంత చర్చ జరిగినప్పటికీ, రికార్డు పుస్తకాల్లో మాత్రం అతనే నంబర్ వన్. ఆ తర్వాత స్థానంలో భారత దిగ్గజం యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై యువీ కేవలం 12 బంతుల్లో 50 రన్స్ బాదాడు. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి యువరాజ్ సృష్టించిన సంచలనం చరిత్రలో నిలిచిపోయింది.
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙆𝙉𝙊𝘾𝙆!
Hardik Pandya is on an absolute roll here in Ahmedabad! 🙌
A 16-ball half-century – Second fastest T20I fifty for #TeamIndia cricketer (in Men’s cricket) 🔥
Updates ▶️ https://t.co/kw4LKLNSl3#INDvSA | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/RqjfXwVsJX
— BCCI (@BCCI) December 19, 2025
వెస్టిండీస్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ కూడా కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. ఇక టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ రేసులో దూసుకుపోతున్నాడు. తాజాగా 2025 డిసెంబర్ 19న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 16 బంతుల్లోనే 50 పరుగులు చేసి తన పవర్ ఏంటో చూపించాడు. ఐపీఎల్ విషయానికొస్తే యశస్వి జైస్వాల్ (13 బంతులు), కేఎల్ రాహుల్ (14 బంతులు) తమ బ్యాట్లకు పనిచెప్పి ఫాస్టెస్ట్ 50ల జాబితాలో చేరారు.
కేవలం టీ20లే కాదు, ఇతర ఫార్మాట్లలో కూడా మెరుపు వీరులు ఉన్నారు. వన్డేల్లో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ బాది ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. టెస్టుల్లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ (35 బంతులు) పంచుకుంటున్నారు. మొత్తానికి క్రికెట్ ఇప్పుడు కండబలం, మెరుపు వేగంతో కూడిన ఆటగా మారిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




