AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఆ పార్ట్ సర్జరీ చేయించుకోవాలని బలవంతం చేశారు.. టాలీవుడ్ హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోతో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీకి టైమ్ కేటాయించింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేకపోయినప్పటికీ నెట్టింట మాత్రం తెగ సందడి చేస్తుంది.

Actress : ఆ పార్ట్ సర్జరీ చేయించుకోవాలని బలవంతం చేశారు.. టాలీవుడ్ హీరోయిన్..
Sameera Reddy
Rajitha Chanti
|

Updated on: Dec 20, 2025 | 1:41 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సమీరా రెడ్డి. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటించిన ఆమె.. ఎన్టీఆర్ జోడిగా అశోక్.. మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవా వంటి చిత్రాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆమె.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తనను సర్జరీ చేయించుకోవాలని బలవంత పెట్టారని అన్నారు.

సమీరారెడ్డి మాట్లాడుతూ.. “నా కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే నాపై కొందరు ఒత్తిడి చేశారు. బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకోవాలని బలవంతం పెట్టారు. ఎంతోమంది హీరోయిన్లు చేయించుకున్నారు. నీకేమైంది.. అన్నారు. నాకు ఇష్టం లేదని చెప్పినా పట్టించుకోలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. నా శరీరంతో ఎలాంటి సమస్య లేనప్పుడు సర్జరీ చేయించుకోనని చెప్పాను. కొందరు నటీనటులు తమ వయసును దాచేస్తుంటారు. నేను మాత్రం గూగుల్లో నా వయసు రెండేళ్లు తక్కువ చూపిస్తుంటే దానిని సరిచేశాను. 40 సంవత్సరాలు పైబడినా నేను చాలా ఉత్సాహంగా ఉంటున్నాను. నా చర్మం డల్ గా ఉన్నప్పుడు నెట్టింట ఫోటోస్ షేర్ చేస్తాను. అలా చేయడం వల్లల చాలా మంది మహిళలు స్పూర్తి పొందుతారని అనుకుంటాను” అని అన్నారు.

తెలుగులో సమీరారెడ్డికి మంచి క్రేజ్ ఉండేది. ఇప్పటికీ ఆమెకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. చివరగా 2013లో కన్నడ సినిమాలో కనిపించిన ఆమె మరో మూవీ చేయలేదు.

ఇవి కూడా చదవండి : Actress : స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై.. ఇప్పుడు 400 కోట్ల ఇంట్లో ఆ హీరోయిన్..

Sameera Reddy News

Sameera Reddy News

ఇవి కూడా చదవండి : Cinema: వార్నీ.. ఈ క్రేజీ హీరోయిన్ ఈ విలన్ భార్యానా.. ? తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు..

సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు