AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోకాళ్లు, మోచేతుల దగ్గర నలుపు ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో 7 రోజుల్లోనే మెరిసే చర్మం మీ సొంతం!

చాలామంది ముఖంపై చూపించినంత శ్రద్ధ మోకాళ్లు, మోచేతులపై చూపించరు. ఫలితంగా అక్కడ చర్మం గరుకుగా, నల్లగా మారుతుంది. మోకాళ్లు, మోచేతుల దగ్గర చర్మం మందంగా ఉండటం వల్ల అక్కడ నలుపు త్వరగా పేరుకుపోతుంది. ఇది మనం పొట్టి దుస్తులు వేసుకున్నప్పుడు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అయితే, ఖరీదైన క్రీములు వాడకుండానే వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..? చర్మంపై ఉండే ఈ నలుపును కేవలం ఏడు రోజుల్లోనే తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Apr 02, 2026 | 8:47 PM

Share
నిమ్మకాయ, చక్కెర (Lemon & Sugar Scrub):
నిమ్మకాయను సగానికి కోసి దానిపై కొంచెం చక్కెర చల్లాలి. దీనిని మోకాళ్లు, మోచేతులపై వృత్తాకారంలో 5-10 నిమిషాల పాటు మెల్లగా రుద్దాలి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ నలుపును వదిలిస్తే, చక్కెర చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ (Exfoliate) చేస్తుంది.

నిమ్మకాయ, చక్కెర (Lemon & Sugar Scrub): నిమ్మకాయను సగానికి కోసి దానిపై కొంచెం చక్కెర చల్లాలి. దీనిని మోకాళ్లు, మోచేతులపై వృత్తాకారంలో 5-10 నిమిషాల పాటు మెల్లగా రుద్దాలి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ నలుపును వదిలిస్తే, చక్కెర చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ (Exfoliate) చేస్తుంది.

1 / 6
 కలబంద, పాలు (Aloe Vera & Milk): కలబంద గుజ్జుకు కొంచెం పాలు కలిపి నల్లగా ఉన్న చోట రాయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగేయాలి. కలబంద చర్మానికి తేమను ఇస్తుంది, పాలు చర్మం రంగును మెరుగుపరుస్తాయి.

కలబంద, పాలు (Aloe Vera & Milk): కలబంద గుజ్జుకు కొంచెం పాలు కలిపి నల్లగా ఉన్న చోట రాయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగేయాలి. కలబంద చర్మానికి తేమను ఇస్తుంది, పాలు చర్మం రంగును మెరుగుపరుస్తాయి.

2 / 6
 కొబ్బరి నూనె, నిమ్మరసం: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ప్రతిరోజూ స్నానానికి ముందు మసాజ్ చేయాలి. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. నలుపును క్రమంగా తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె, నిమ్మరసం: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ప్రతిరోజూ స్నానానికి ముందు మసాజ్ చేయాలి. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. నలుపును క్రమంగా తగ్గిస్తుంది.

3 / 6
బేకింగ్ సోడా, పాలు: ఒక స్పూన్ బేకింగ్ సోడాకు తగినన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీనిని రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

బేకింగ్ సోడా, పాలు: ఒక స్పూన్ బేకింగ్ సోడాకు తగినన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీనిని రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

4 / 6
బంగాళాదుంప (Potato): బంగాళాదుంప ముక్కను తీసుకుని నల్లగా ఉన్న ప్రాంతంలో రుద్దాలి లేదా దాని రసాన్ని రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇందులో ఉండే క్యాటకోలేస్ (Catecholase) అనే ఎంజైమ్ చర్మాన్ని తెల్లగా మార్చడానికి తోడ్పడుతుంది.

5 / 6
 ఈ చిట్కాలు పాటించడంతో పాటు ఎండలోకి వెళ్ళేటప్పుడు మోకాళ్లు, మోచేతులకు కూడా సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోకండి. చర్మం పొడిబారకుండా నిరంతరం మాయిశ్చరైజర్ రాస్తుంటే నలుపు త్వరగా రాకుండా ఉంటుంది.

ఈ చిట్కాలు పాటించడంతో పాటు ఎండలోకి వెళ్ళేటప్పుడు మోకాళ్లు, మోచేతులకు కూడా సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోకండి. చర్మం పొడిబారకుండా నిరంతరం మాయిశ్చరైజర్ రాస్తుంటే నలుపు త్వరగా రాకుండా ఉంటుంది.

6 / 6
Follow Us