బొప్పాయి..కేవలం రుచిలోనే కాక, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. విటమిన్ సి, ఏ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణ ఎంజైమ్లు పుష్కలంగా ఉన్న ఈ అమృత ఫలాన్ని వేసవిలో తీసుకోవడం మరింత ప్రయోజనకరం. ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లి, రోజంతా శక్తి లభిస్తుంది.