IND vs NZ: ఒక్కరోజులో 400 రన్స్ అని సెప్తిరి.. ఇప్పుడేమో ఇలా.. టీమిండియా కోచ్ గంభీర్‌పై ట్రోల్స్

బెంగళూరుతో న్యూజిలాండ్ తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా ఆటతీరు అందరినీ నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా ప్రపంచంలో మేటి బ్యాటర్లు అని గుర్తింపున్న ప్లేయర్లందరూ మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలో కోచ్ గంభీర్ పై కూడా విమర్శలు వస్తున్నాయి.

IND vs NZ: ఒక్కరోజులో 400 రన్స్ అని సెప్తిరి.. ఇప్పుడేమో ఇలా.. టీమిండియా కోచ్ గంభీర్‌పై ట్రోల్స్
Gautam Gambhir
Follow us

|

Updated on: Oct 17, 2024 | 7:20 PM

బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అక్టోబరు 16 నుంచి ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక రోజు ఆలస్యంగా జరిగింది. అదేంటంటే.. అక్టోబర్ 17 నుంచి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. జట్టులో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరుకు చేరుకోగా, ఐదుగురు ఆటగాళ్లు అసలు ఖాతాలు తెరవలేకపోయారు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నారు. దీంతో టీమిండియా ఆటతీరుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే క్రమంలో 2 రోజుల క్రితం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు, జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. జట్టు అటాకింగ్‌ గేమ్ పై అడిగిన ప్రశ్నకు గంభీర్‌ సమాధానమిస్తూ.. ‘పరిస్థితులు ఎలా ఉన్నా ఆట తీరుపై రాజీపడబోం. అలాగే ఈ దూకుడు వ్యూహంతో జట్టు ఒక్కోసారి కేవలం 100 పరుగులకే ఆలౌటయ్యే అవకాశం ఉంది. కానీ మేము దానిని ఓపెన్ మైండ్‌తో అంగీకరిస్తున్నాం’ అని పేర్కొన్నాడు గంభీర్. ఈ ప్రకటన చేసిన 2 రోజుల్లోనే టీమ్ ఇండియా కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. ఎన్నోచెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

ఇవి కూడా చదవండి

జట్టు బ్యాటర్ల సహజ సామర్థ్యం గురించి గంభీర్ మాట్లాడుతూ, ‘ఆటగాళ్లు దూకుడు స్వభావం కలిగి ఉంటే, మేం వారిని రక్షణాత్మకంగా ఆడమని అడగం. . ఒక రోజులో 400-500 పరుగులు చేసే ఆటగాళ్లను మనం ఎందుకు నియంత్రించాలి. ఇక టీ20 క్రికెట్ పరంగా నేనెప్పుడూ చెబుతుంటాను. రిస్క్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ దూకుడైన వైఖరితో మన జట్టు ఒక్కరోజు 100 పరుగులకే ఔట్ అవ్వచ్చు. రిస్క్ తీసుకుని ఆడే ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాం’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు గంభీర్ ను ట్రోల్ చేస్తున్నారు.

గంభీర్ కామెంట్స్ వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..