Heart Attack: గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేస్తే.. మీ ప్రాణం పదిలమే!
What to do after person got heart attack? గుండెపోటు లక్షణాలు మగవారికన్నా ఆడవారిలో భిన్నంగా ఉండొచ్చు. నిజానికి పురుషులతో పోలిస్తే మహిళలకు గుండె జబ్బు ముప్పు తక్కువ. దీనికి కారణం ఈస్ట్రోజన్ రక్షణ. కానీ నెలసరి నిలిచిన తర్వాత ఈస్ట్రోజన్ మోతాదులు తగ్గటం వల్ల గుండె జబ్బు ముప్పూ పెరుగుతుంది..
Updated on: Dec 20, 2025 | 11:31 AM

గుండెపోటు లక్షణాలు మగవారికన్నా ఆడవారిలో భిన్నంగా ఉండొచ్చు. నిజానికి పురుషులతో పోలిస్తే మహిళలకు గుండె జబ్బు ముప్పు తక్కువ. దీనికి కారణం ఈస్ట్రోజన్ రక్షణ. కానీ నెలసరి నిలిచిన తర్వాత ఈస్ట్రోజన్ మోతాదులు తగ్గటం వల్ల గుండె జబ్బు ముప్పూ పెరుగుతుంది.

పైగా వీరిలో ఛాతీ నొప్పికి బదులు ఏదో తెలియని నిస్సత్తువ, తల తేలిపోవటం, కడుపు నొప్పి.. మెడ, భుజాలు, వీపులో నొప్పి వంటి లక్షణాలు పొడసూపొచ్చు. కొన్నిసార్లు కేవలం ఆయాసం మాత్రమే ఉండొచ్చు. సరైన కారణమేదీ లేకుండా శ్వాస తీసుకోవటం కష్టంగా అనిపించొచ్చు. కాబట్టి వీటినీ హెచ్చరిక సంకేతాలుగానే చూడాలి.

గుండెపోటు వచ్చినప్పుడు అందరూ చాలా భయపడతారు. అయితే గుండెపోటు సమయంలో సరైన చర్యలు తీసుకుంటే ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి, ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించాలి. ఎంత త్వరగా వైద్య సహాయం అందితే బతికే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.

గుండెపోటు వల్ల మరణాల రేటు 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. సంబంధిత వ్యక్తిలో గుండెపోటు లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తే, వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్చాలి. గోల్డెన్ అవర్ సమయంలో వ్యక్తికి చికిత్స అందితే అతని ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే గుండెపోటు వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమైనది.

దీనితో పాటు గుండెపోటును నివారించడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం. దీనితో పాటు జీవనశైలిలో మార్పులు కూడా అవసరం. గుండెపోటు వస్తే రోగికి వెంటనే CPR ఇవ్వాలి. ఇది రోగి ప్రాణాలను కూడా కాపాడుతుంది.




