AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?

Can Eating Tomatoes Trigger Kidney Stones? ఇటీవలి కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువత కిడ్నీ రాళ్ల సమస్యతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో చాలా మందికి అసలు కిడ్నీల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయనే దానిపై సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు టమాటా తిరడం వల్ల కిడ్నీల్లో

ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
Tomatoes For Kidney Health
Srilakshmi C
|

Updated on: Dec 20, 2025 | 12:09 PM

Share

ఇటీవలి కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువత కిడ్నీ రాళ్ల సమస్యతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో చాలా మందికి అసలు కిడ్నీల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయనే దానిపై సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు టమాటా తిరడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని భావిస్తుంటారు. దీంతో టమోటాలు తినకుండా ఉంటారు. రోజూ ఆహారంలో భాగంగా టమోటాలను తినడం వల్ల లేదా ఆహారంలో ఏదో ఒక విధంగా ఉపయోగించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయనేది వీరి నమ్మకం. కాబట్టి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయేమోనన్న భయంతో టమోటాలు తినడం మానేస్తుంటారు. అయితే ఇందులో నిజమెంతో, ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

టమోటాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయనే నమ్మకాన్ని ఆరోగ్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. టమోటాలలో ఉండే ఆక్సలేట్ కంటెంట్ వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయని సాధారణంగా అందరూ భావిస్తుంటారు. అయితే, ఈ కూరగాయలో చాలా తక్కువ మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. అంటే 100 గ్రాముల టమోటాలలో కేవలం 5 మిల్లీగ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ మొత్తంలో కిడ్నీలో రాళ్లు రావడానికి సరిపోదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పతాయంటే?

మూత్రపిండాల్లో రాళ్లు రావడానికి ప్రధాన కారణం సాధారణంగా డీహైడ్రేషన్. ఏదైనా పని చేసే వారు ఎవరైనా ప్రతిరోజూ కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని ఎంజైమ్‌ల లోపాలు, జీవక్రియ సమస్యల వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఆక్సలోసిస్ అనే అరుదైన జీవక్రియ రుగ్మత కారణంగా మూత్రపిండాలు శరీరం నుంచి కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను మూత్రం ద్వారా విసర్జించడం ఆపివేస్తాయి. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

కొన్నిసార్లు కాల్షియం ఆక్సలేట్‌తో పాటు, యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ రాళ్ళు, సిస్టీన్ రాళ్ళు వంటి ఇతర రకాల స్ఫటికాల నుంచి కూడా రాళ్ళు ఏర్పడతాయి. కొన్ని మాంసాహార ఆహార పదార్థాల వినియోగం కూడా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుందని కొందరు భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. మూత్రపిండాల సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారుప్రోటీన్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అయితే ఇలాంటి ఆహారం తీసుకునేముందు వైద్యుడి సలహా పాటించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?