AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?

అరటి పండ్లు.. అన్ని కాలాల్లో, అన్ని చోట్ల, అన్ని సమయాల్లో సులభంగా లభించే సూపర్ ఫుడ్. కానీ చాలా మంది ఈ పండు తినడానికి ఇష్టపడరు. అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి..

గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
Banana
Srilakshmi C
|

Updated on: Dec 20, 2025 | 11:40 AM

Share

అరటి పండ్లు.. అన్ని కాలాల్లో, అన్ని చోట్ల, అన్ని సమయాల్లో సులభంగా లభించే సూపర్ ఫుడ్. కానీ చాలా మంది ఈ పండు తినడానికి ఇష్టపడరు. అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందడమేకాదు గుండె ఆరోగ్యానికి కూడా అనేక అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయట. అరటి పండ్ల వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

తక్షణ శక్తి

అరటిపండ్లు త్వరిత శక్తిని అందించడంలో ముందంజలో ఉంటాయి. ఇందులోని సహజ చక్కెర, ఫైబర్ కంటెంట్ రోజంతా అవసరమైన శక్తిని అందిస్తుంది. తద్వారా అలసట తగ్గుతుంది.

మానసిక ప్రశాంతత

అరటిపండ్లు శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా మేలు చేస్తాయి. అరటిపండ్లలోని ట్రిప్టోఫాన్ అనే పదార్ధం మంచి అనుభూతిని కలిగించే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇనుము లోపం ఉన్న రక్తహీనత ఉన్నవారికి అరటిపండ్లు చాలా మంచివి. ఇందులో ఇనుము పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

రోగనిరోధక శక్తి

ఈ పండు తినడం వల్ల విటమిన్ బి6, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. అదేవిధంగా అరటిపండ్లలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ముడతలను తగ్గిస్తాయి. అంతే కాదు ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలకు అరటిపండ్లు చాలా మంచివి. ప్రతిరోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల బిడ్డకు, తల్లి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.