AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Workouts: వర్కవుట్స్ ఏ టైమ్‌లో చేస్తున్నారు? ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న బెస్ట్‌ టైమ్ ఏదో తెలుసా

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. కానీ, చాలామందిని వేధించే అతిపెద్ద సందేహం ఏంటంటే.. వ్యాయామం ఎప్పుడు చేయాలి? పొద్దున్నే నిద్రలేచి చెమట చిందించాలా లేక రోజంతా పనులు ముగించుకుని రాత్రి పూట జిమ్‌కు వెళ్లాలా? ఏ సమయంలో వర్కవుట్ చేస్తే త్వరగా బరువు ..

Workouts: వర్కవుట్స్ ఏ టైమ్‌లో చేస్తున్నారు? ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న బెస్ట్‌ టైమ్ ఏదో తెలుసా
Work Outs
Nikhil
|

Updated on: Dec 20, 2025 | 6:46 AM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. కానీ, చాలామందిని వేధించే అతిపెద్ద సందేహం ఏంటంటే.. వ్యాయామం ఎప్పుడు చేయాలి? పొద్దున్నే నిద్రలేచి చెమట చిందించాలా లేక రోజంతా పనులు ముగించుకుని రాత్రి పూట జిమ్‌కు వెళ్లాలా? ఏ సమయంలో వర్కవుట్ చేస్తే త్వరగా బరువు తగ్గుతారు? ఏది మన బాడీకి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది? దీనిపై ఫిట్‌నెస్ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ఉదయం వ్యాయామం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం వేళ వ్యాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉదయాన్నే వర్కవుట్ ముగించుకుంటే, రోజంతా ఇతర పనులపై దృష్టి పెట్టవచ్చు. దీనివల్ల వ్యాయామం మిస్ అయ్యే అవకాశం తక్కువ. ఉదయం ఎండలో లేదా తాజా గాలిలో వ్యాయామం చేయడం వల్ల రాత్రి పూట గాఢ నిద్ర పడుతుంది. రోజంతా చురుగ్గా ఉండటానికి, మెటబాలిజం రేటు పెరగడానికి ఉదయం వర్కవుట్స్ ఎంతగానో తోడ్పడతాయి.

రాత్రి వ్యాయామం

కొందరికి రాత్రి పూట వ్యాయామం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రోజంతా ఆహారం తీసుకోవడం వల్ల సాయంత్రం వేళ మన శరీరంలో ఎనర్జీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువులు ఎత్తడం లేదా కఠినమైన వ్యాయామాలు చేయడం సులభం అవుతుంది. ఆఫీస్ టెన్షన్లు, ఇంటి పనుల ఒత్తిడి తర్వాత రాత్రి చేసే వర్కవుట్ మనసును తేలికపరుస్తుంది. ఉదయం బాడీ కొంచెం స్టిఫ్ గా ఉంటుంది. అదే సాయంత్రం అయితే కండరాలు వేడెక్కి ఉండటం వల్ల గాయాలయ్యే ముప్పు తక్కువ.

అసలు ఏది ఉత్తమం?

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఉదయం లేదా రాత్రి అనేదాని కంటే ఏ సమయంలో వ్యాయామం చేసినా, దాన్ని రోజూ క్రమం తప్పకుండా చేస్తున్నారా లేదా అన్నదే ప్రధానం. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం వ్యాయామం చేయడం మంచిది. ఉదయం ఖాళీ కడుపుతో చేసే కార్డియో వ్యాయామాలు ఫ్యాట్ బర్న్ చేయడానికి మేలని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

కండరాల పుష్టి కోసం వ్యాయామం చేయాలనుకుంటే సాయంకాలమే మంచి సమయం. సాయంత్రం వేళ వర్కవుట్ చేయడం వల్ల శరీరపుష్టి సాధ్యమవుతుంది. చివరిగా నిపుణులు చెప్పేది ఒక్కటే.. మీ జీవనశైలికి, మీ శరీర తత్వానికి ఏ సమయం సెట్ అవుతుందో అదే మీకు బెస్ట్ టైమ్. అయితే నిద్రకు కనీసం రెండు మూడు గంటల ముందే రాత్రి వ్యాయామాన్ని ముగించడం మంచిది, లేదంటే నిద్ర పట్టడం కష్టమవుతుంది.

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..