AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు స్టార్ హీరోలతో ఎఫైర్స్ రూమర్స్.. ఈ హీరోయిన్ మాముల్దీ కాదు గురూ..

బాలీవుడ్ బ్యూటీ కాజోల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తొలినాళ్లలో ఎన్నో అవమానాలు భరించి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తనదైన ముద్ర వేసింది. హిందీలో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

Actress : అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు స్టార్ హీరోలతో ఎఫైర్స్ రూమర్స్.. ఈ హీరోయిన్ మాముల్దీ కాదు గురూ..
Fatima
Rajitha Chanti
|

Updated on: Dec 20, 2025 | 11:42 AM

Share

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ క్రేజ్ గురించి తెలిసిందే. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కాజోల్ ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. ఇప్పుడిప్పుడే చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. అయితే ఆమె సినిమాలతో కాకుండా స్టార్ హీరోలతో ఎఫైర్స్ అంటూ రూమర్స్ తోనే పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి.. ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ఆమె నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టాయి.

బాలనటీనటులుగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సూపర్ స్టార్లుగా మారినవారు చాలా మంది ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. కాజోల్ ఎత్తుకున్న ఆ చిన్నారి ఇప్పుడు భారతీయ సినిమాల్లో ప్రసిద్ధ హీరోయిన్. ఆమె మరెవరో తెలుసా.. ? తనే హీరోయిన్ ఫాతిమా సనా షేక్. కాజోల్, ఫాతిమా సనా ఇద్దరూ కలిసిన ఓ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 1997లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఇష్క్’లో కాజోల్ తో కలిసి ఫాతిమా సనా నటించింది. అజయ్ దేవగన్, కాజోల్, ఆమిర్ ఖాన్, జూహి చావ్లా నటించిన ఈ చిత్రంతో ఫాతిమా వెండితెరపై అడుగుపెట్టింది.

ఆ తర్వాత కమల్ హాసన్ చిత్రం ‘చాచి 420’లో ఫాతిమా చెప్పుకోదగ్గ పాత్ర పోషించింది. షారుఖ్ ఖాన్ చిత్రం ‘వన్ టూ కా ఫోర్’లో ఫాతిమా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించింది.బాలనటిగా చాలా సినిమాలు చేసినప్పటికీ, 2016లో ‘దంగల్’ సినిమాలో నటించినప్పుడు ఫాతిమా జీవితం మారిపోయింది. రెజ్లర్ గీతా ఫోగట్ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో ఫాతిమా అమీర్ ఖాన్ కూతురి పాత్రలో నటించింది. కేవలం 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా భారతదేశంలోనే 387 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఒక్క సినిమాతోనే ఫాతిమా భారతదేశమంతటా ప్రసిద్ధి చెందింది.

దంగల్ తర్వాత, ఫాతిమాకు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్ లతో కలిసి భారీ బడ్జెట్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’లో నటించే అవకాశం లభించింది. అయితే, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు హిందీలో వరుస సినిమాల్లో నటిస్తున్న ఫాతిమా సనా.. ఎక్కువగా ఎఫైర్స్ రూమర్స్ తోనే పాపులర్ అయ్యింది. ఆమె స్టార్ హీరోలతో ప్రేమలో పడిందని రూమర్స్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంటాయి. కానీ వాటిపై ఫాతిమా ఇప్పటివరకు స్పందించలేదు.

ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..

ఇవి కూడా చదవండి : Actress : స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై.. ఇప్పుడు 400 కోట్ల ఇంట్లో ఆ హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Cinema: వార్నీ.. ఈ క్రేజీ హీరోయిన్ ఈ విలన్ భార్యానా.. ? తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు..